Padma Awards Benefits: పద్మ అవార్డు గ్ర‌హీత‌ల‌కు ఏయే ఉచితాలుంటాయి ? ఎలాంటి సౌకర్యాలుంటాయి ?

Padma Awards Benefits: తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి తాజాగా.. రాష్ట్ర‌ప‌తి  ద్రౌప‌ది ముర్ము  నుంచి ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు స్వీకరించారు. ఈ నేప‌థ్యంలో ప‌ద్మ అవార్డు గ్ర‌హీత‌ల‌కు ఎలాంటి సౌక‌ర్యాలు ఉంటాయి. దేశంలో తిరిగే రైలు, విమాన ప్ర‌యాణాలు ఉచిత‌మా.. ?  వివ‌రాల్లోకి వెళితే..

1 /8

ప‌ద్మ అవార్డులు దేశ అత్యున్న‌త పుర‌స్కారాలు.  అందులో భార‌త ర‌త్న త‌ర్వాత‌.. ప‌ద్మ విభూష‌ణ్, ప‌ద్మ భూష‌ణ్, ప‌ద్మ‌శ్రీ అవార్డులున్నాయి. ఏదైనా రంగంలో అసాధార‌ణమైన ప్ర‌తిభ ఉన్న వారికీ ఈ అవార్డుల‌తో కేంద్రం గౌర‌విస్తూ వ‌స్తోంది.

2 /8

ప‌ద్మ అవార్డులు మ‌న దేశంలో 1954లో ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత 1977లో అధికారంలోకి వ‌చ్చిన జ‌న‌తా ప్ర‌భుత్వం ప‌ద్మ అవార్డుల‌పై నిషేధం విధించింది. ఈ నేప‌థ్యంలో 1978, 1979లో ఈ అవార్డులు ఇవ్వ‌లేదు.

3 /8

ఆ త‌ర్వాత పీవీ న‌రసింహా రావు ప్ర‌భుత్వం 1993 నుంచి 1996 వ‌ర‌కు ఇవ్వ‌లేదు. ఆ త‌ర్వాత వాజ్‌పేయ్ గ‌వ‌ర్న‌మెంట్  1997లో ప‌ద్మ అవార్డులు ఇవ్వ‌లేదు.

4 /8

2024 యేడాది కూడా 128 మందికి ప‌ద్మ అవార్డుల‌ను కేంద్రం అంద‌జేసింది కేంద్ర ప్ర‌భుత్వం. అందులో ఇద్ద‌రు తెలుగువారైనా వెంక‌య్య నాయుడు, చిరంజీవికి  ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డుల‌తో స‌త్క‌రించింది.  

5 /8

పద్మ విభూష‌ణ్ అది ఆయా రంగాల్లో అసాధార‌ణ‌మైన విశిష్ట సేవ‌లు అందించిన వారికీ ఇస్తారు. పద్మ భూష‌ణ్ అత్యంత విశిష్ట సేవ‌ల‌కు ఇస్తారు. ప‌ద్మ‌శ్రీ కూడా అసాధార‌ణ‌మైన ప్ర‌తిభ ఉన్న వారికీ ఇస్తుంటారు. గ‌వ‌ర్న‌మెంట్ సర్వెంట్స్ కు ఈ అవార్డులు ఇవ్వ‌రు. వారి వ్య‌క్తిగ‌త ప్ర‌తిభ ఆధారంగా ఇవ్వొచ్చు.

6 /8

ప‌ద్మ అవార్డు గ్ర‌హీత‌ల‌కు ఎలాంటి సౌక‌ర్యాలు ఉంటాయి. డ‌బ్బుకు సంబంధించిన ప్రోత్స‌హాకాలు ఉంటాయా .. ? ఇలాంటి అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. నిజానికి ప‌ద్మ అవార్డులు ఓ గౌర‌వం మాత్ర‌మే. ఈ అవార్డు వ‌చ్చిన వారికీ ఎలాంటి న‌గ‌దు, రాయితీ ఇవ్వ‌రు.

7 /8

రైలు, విమాన ప్ర‌యాణం వాటిల్లో కూడా ఎలాంటి రాయితీ ఉండ‌దు. ఈ అవార్డు గ్రహీత‌లు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తిని క‌లిసే అవకాశం ఉంటుంది. ప‌ద్మ అవార్డుల్లో రాష్ట్ర‌ప‌తి సంత‌కంతో కూడిన ధృవీక‌ర‌ణ ప‌త్రం ..ప‌త‌కం మాత్ర‌మే ఉంటాయి.

8 /8

పద్మ అవార్డుల ప్ర‌యోజ‌నాల విష‌యానికొస్తే.. గ్ర‌హీత‌లు.. ప్ర‌భుత్వం.. మీడియా... సామాన్య ప్ర‌జ‌ల్లో విస్తృత‌మైన గుర్తింపును పొందుతారు. నేష‌న‌ల్ లెవ‌ల్లో ఫోక‌స్ అవుతారు  కాబ‌ట్టి వారు చేసిన సేవ‌లు దేశ వ్యాప్తంగా గుర్తింపుకు నోచుకుంటాయి.