Madhavi latha Assets: హైదరాబాద్ శివంగీ.. ఎంపీ అభ్యర్థి మాధవీలత ఆస్తులు ఎంతో తెలుసా..?

Madhavilatha Assets: బీజేపీ తరపున హైదరాబాద్ ఎంపీ సీటును మాధవీలతకు కేటాయించారు. ఇటీవల  ఎన్నికల ప్రచారంలో సివంగిలా దూసుకుపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఓవైసీ బ్రదర్స్ కు తన వాగ్దాటితో చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా,ఆమె తన ఆస్తుల డిటెయిల్స్ ను ఈసీకి అఫిడవిట్ రూపంలో అందించారు. 
 

  • Apr 25, 2024, 15:07 PM IST
1 /6

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమ్మర్ హీట్ ను మరింతగా పెంచుతున్నాయి. బీజేపీ ఈసారి రోటీన్ కు భిన్నంగా ఆలోచించి హైదరాబాద్ ఎంపీ స్థానానికి మాధవీలతను నిలబెట్టింది. విరించీ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు సేవలు చేస్తున్న మాధవీలతకు హైదరాబాద్ ఎంపీ సీటును కేటాయించారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారంలో మాధవీలత వినూత్నంగా దూసుకుపోతున్నారు.   

2 /6

ఎక్కడ అవకాశం దొరికిన ఓవైసీ బ్రదర్స్ పై తనదైన స్టైల్ లో సెటైర్ లు వేస్తున్నారు. పాతబస్తీ పదేళ్లపాటు వెనక్కు వెళ్లిపోయిందన్నారు. ఇక్కడ ఓవైపీ బ్రదర్స్ చేసిన డెవలప్ మెంట్ శూన్న మన్నారు. అంతేకాకుండా.. కులమతాలకు అతీతంగా అందర్ని మాధవీలత కలుపుకుని తీసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా ఎంపీ అభ్యర్థి మాధవీలత తన ఆస్తుల జాబితాను ఈసీకి అఫిడవిట్ రూపంలో సబ్మిట్ చేశారు.   

3 /6

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు.. రూ. 218. 38 కోట్ల ఆస్తులున్నట్లు ఆమె తెలిపింది. అంతేకాకుండా.. అందులో రూ. 165. 46 కోట్లు చరస్తులు, రూ.55.92 కోట్ల స్థిరాస్థులు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. మాధవీ పేరిట.. విరించి లిమిటెడ్, వినో బయోటెక్ లో.. రూ. 8.92 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆమెకు సొంత వాహానం,భూములు కానీ లేవని ఆమె పేర్కొన్నారు.   

4 /6

అదే విధంగా మాధవీలపై మాత్రం ఒక క్రిమినల్ కేసు ఉందని ఆమె తన అఫిడవిట్ లో వివరాలను వెల్లడించారు. కాగా ఎంపీ అభ్యర్థి మాధవీలత ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచారు. ఆమె వెరైటీ ప్రచారం, ఓవైసీ సోదరులపై విరుచుకుపడటం వంటివాటితో ఎల్లప్పులు కూడా వార్తలలో ఉంటున్నారు.   

5 /6

ముఖ్యంగా శ్రీరామనవమి రోజున శోభాయాత్రలో ఆమె మసీదువైపు బాణం వేసినట్లు పోజ్ ఇవ్వడం, దీనిపైపెద్ద దుమారమే చెలరేగింది. మరోవైపు మాధవీలతకు ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం తన మద్దతు పలికారు. ఇటీవల ఆయన మాధవీలతను సపోర్ట్ చేస్తు, అసదుద్దీన్ సోదరులపై మండిపడ్డారు. గాలిలో బాణం వేస్తే మసీదుపై వేశారని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు.

6 /6

కాంగ్రెస్ ప్రభుత్వ ఓవైసీ సోదరుల చేతిలో కీలు బొమ్మగా మారిందన్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ కూడా హిందువులకు వ్యతిరేకంగా పనిచేసిందని, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా ముస్లింలకు సపోర్ట్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నాడన్నారు. అదే విధంగా.. పోలీసులు కూడా హిందువులను టార్గెట్ చేశారని, ముస్లిం పండుగలు, ర్యాలీలకు లేని అడ్డంకులు, పర్మిషన్ లు, హిందువుల పండుగలకు తీసుకొవాలని ఎలా అంటారని ఆయన విమర్శిస్తున్నారు.