Cholesterol Cut Fishes: ఈ చేప తింటే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ జాడే ఉండదు..!

Cholesterol Cutting Fishes: కొలెస్ట్రాల్ మన నాళాల్లో కనిపిస్తాయి. ఇది విటమిన్ డీ ప్రాసెస్‌ చేయడానికి సహాయపడుతుంది. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL), మంచి కొలెస్ట్రాల్ (HDL) రెండూ ఉంటాయి. ఈరోజల్లో అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో ప్రాణాంతక గుండె సమస్యలకు దారితీస్తాయి.
 

Cholesterol Cutting Fishes: కొలెస్ట్రాల్ మన నాళాల్లో కనిపిస్తాయి. ఇది విటమిన్ డీ ప్రాసెస్‌ చేయడానికి సహాయపడుతుంది. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL), మంచి కొలెస్ట్రాల్ (HDL) రెండూ ఉంటాయి. ఈరోజల్లో అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో ప్రాణాంతక గుండె సమస్యలకు దారితీస్తాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి బ్లడ్‌ ప్రెజర్‌  కూడా పెరిగిపోతుంది. ఇది హార్ట్‌ అటాక్‌, స్ట్రోక్‌ సమస్యలకు చెక్‌ పెడుతుంది. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి సమతుల ఆహారం, ఎక్సర్‌సైజ్‌ చేయాలి. అంతేకాదు కొన్ని రకాల చేపలను మీ డైట్లో చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గిపోతాయి.

1 /6

ట్యూనా చేపలు.. ట్యూనా చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ట్యూనా ఫిష్‌లో మన శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను పారదోలే శక్తి ఉంటుంది. 

2 /6

ట్రౌట్‌ ఫిష్‌.. ఈ చేపలతో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి సహాయపడతాయి. 

3 /6

హెర్రింగ్‌ ఫిష్‌.. ఈ చేప మన శరీరానికి కావాల్సిన రెండు రకాల ఫ్యాటీ యాసిడ్స్‌ EPA, DHA ను అందిస్తుంది. ఇది వాపు సమస్యను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుచేస్తుంది.  హెర్రింగ్‌ చేపల్లో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది.

4 /6

మెకెరల్ ఫిష్‌.. మెకెరల్ చేపలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపించేస్తుంది. ఈ మెకరల్ చేపను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఇష్టంగా కూడా తింటారు.

5 /6

సార్డైన్.. సార్డైన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అద్భుతంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ నిర్వహణకు సహాయపడుతుంది. సార్డైన్ చేపలతో ఐరన్, సెలీనియం, ఫాస్పరస్‌, కాల్షియం, పొటాషియ వంటి ఖనిజాలు ఉంటాయి. సార్డైన్ చేపలతో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్‌ షుగర్ ను తగ్గిస్తుంది.

6 /6

స్వార్డ్‌ ఫిష్.. ఈ చేపల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. స్వార్డ్‌ చేప రక్తపోటును సమర్థవంతంగా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ స్థాయిలను బయటకు తరిమేస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )