Brain Health Tips: రోజూ ఈ డ్రింక్స్ తాగితే చాలు మీ మెదడు కంప్యూటర్‌లా పనిచేస్తుంది

మనిషి వయస్సు పెరిగే కొద్దీ మెదడు పనితీరు, సామర్ధ్యం తగ్గిపోతుంటుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియే. కానీి కొన్ని చిట్కాలు లేదా సహజసిద్ధమైన డ్రింక్స్ సేవించడం ద్వారా వయసు మీరినా సరే మెదడు పనితీరు వేగంగా ఉండేలా చేయవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. అలాంటి 5 డ్రింక్స్ గురించి తెలుసుకుందాం.

Brain Health Tips: మనిషి వయస్సు పెరిగే కొద్దీ మెదడు పనితీరు, సామర్ధ్యం తగ్గిపోతుంటుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియే. కానీి కొన్ని చిట్కాలు లేదా సహజసిద్ధమైన డ్రింక్స్ సేవించడం ద్వారా వయసు మీరినా సరే మెదడు పనితీరు వేగంగా ఉండేలా చేయవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. అలాంటి 5 డ్రింక్స్ గురించి తెలుసుకుందాం.
 

1 /5

గ్రీన్ జ్యూస్ గ్రీన్ జ్యూస్ అనేది మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఇందులో పాలకూర, అరటి, బ్రోకలీ సహా ఆకుకూరలు కలపవచ్చు. ఇందులో ఫోలేట్, ల్యూటిన్ వంటి పోషకాలతో పాటు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

2 /5

దానిమ్మ జ్యూస్ దానిమ్మ వాస్తవానికి ఓ అద్బుతమైన యాంటీ ఆక్సిడెంట్. మెదడు కణజాలానికి హాని కల్గించే మృత కణాల్నించి కాపాడుతుంది. రెడ్ వైన్, గ్రీన్ టీతో పోలిస్తే దానిమ్మలోనే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 

3 /5

బీట్‌రూట్ జ్యూస్ బీట్‌రూట్ జ్యూస్ అనేది శరీరాన్ని హానికారకమైన కణాల్నించి, ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. ఇందులో ఉండే నైట్రేట్ కారణంగా బ్లడ్ ప్రెషర్ ముప్పు తగ్గుతుంది. బ్రెయిన్ స్ట్రోక్, డిమెన్షియా సమస్య తగ్గుతుంది. 

4 /5

బెర్రీ జ్యూస్ బెర్రీస్ ఆరోగ్యపరంగా చాలా మంచివి. శరీరంలోని అన్ని అవయవాలకు ఇది మేలు చేకూరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరాన్ని ఆక్సిడేటివ్ స్థితి నుంచి కాపాడుతాయి. ఇందులో ఉండే ఏంధోసయానిన్ అనే రసాయనం కారణంగా మెమరీ పెరుగుతుంది.

5 /5

క్యారట్ జ్యూస్ క్యారట్ అనేది కంటికి చాలా చాలా మంచిది. అదే సమయంలో మానసిక ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ కారణంగా మెదడులోని కణజాలం స్వెల్లింగ్ తగ్గుతుంది. జ్ఞాపకశక్తి పెంచుతుంది. రోజు విడిచి రోజు భోజనం తరువాత తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.