Anasuya: కుటుంబంతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనసూయ..

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ గురించి కొత్త చెప్పాల్సిన పనిలేదు. ఈమెలో గ్లామర్ యాంగిల్ మాత్రమే తెలియని ఆధ్యాత్మిక కోణం ఉంది. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా విహార యాత్రలతో పాటు పనిలో పనిగా ఆధ్యాత్మిక యాత్ర చేసింది. అస్సామ్‌లోని ప్రముఖ కామాఖ్య ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకుంది. 

1 /6

అనసూయ భరద్వాజ్ త‌న పుట్టిన‌రోజు సంద‌ర్బంగా త‌న భర్త, కుమారులతో క‌లిసి కామాఖ్య ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్నారు.

2 /6

ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో అన‌సూయ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  కుమారులు, భ‌ర్త‌తో క‌లిసి దిగిన ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది.

3 /6

యాంకర్ అనసూయ భరద్వాజ్ కెరీర్‌ ప్రారంభంలో  టెలివిజన్ యాంకర్‌గా.. ఆపై జబర్దస్త్ షో యాంకర్‌గా తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

4 /6

అనసూయ హైదరాబాద్ బద్రూకా కాలేజ్ నుంచి MBA చేసింది. పలు కంపెనీలకు  హెచ్ఆర్‌గా పనిచేసింది. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమా ఆఫర్స్ ను తిరస్కరించడం విశేషం.

5 /6

జబర్దస్త్ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో నటిస్తోంది అన‌సూయ . అక్కడ కూడా నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది రంగమ్మత్త.  

6 /6

ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయనా, రంగస్థలం, గాడ్ ఫాదర్ సహా పలు చిత్రాల్లో అనసూయ పాత్రకు మంచి అప్లాజ్ దక్కాయి. తాజాగా రజాకార్ చిత్రంలోని నటనకు మంచి మార్కులే పడ్డాయి.