అమెరికాలో తెలుగు టెక్కీ మృతి

అమెరికాలో తెలుగు టెక్కీ మృతి చెందాడు.

Last Updated : Jul 2, 2018, 01:02 PM IST
అమెరికాలో తెలుగు టెక్కీ మృతి

అమెరికాలో తెలుగు టెక్కీ మృతి చెందాడు. విహార యాత్ర కోసం నార్త్ కరోలినా వెళ్లిన గోగినేని నాగార్జున ఛార్లెట్‌ వద్ద గల జలపాతంలో పడి ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. నాగార్జున అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతని స్వగ్రామం కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామం.

నాగార్జున మృతితో గొట్టుముక్కల గ్రామంలో విషాదం నెలకొంది. నాగార్జున పదేళ్ల క్రితమే ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. నాగార్జున ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

Trending News