విజయ్ మాల్యాకు మూడు వారాల గడువిచ్చిన కోర్టు

ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం ఈడీ కేసుల్లో వివరణ ఇచ్చేందుకు విజయ్ మాల్యాకు న్యాయస్థానం 3 వారాల గడువిచ్చింది.

Last Updated : Sep 3, 2018, 06:40 PM IST
విజయ్ మాల్యాకు మూడు వారాల గడువిచ్చిన కోర్టు

ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం ఈడీ కేసుల్లో వివరణ ఇచ్చేందుకు విజయ్ మాల్యాకు న్యాయస్థానం 3 వారాల గడువిచ్చింది. కొత్త చట్టం ప్రకారం.. ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు’గా ఈడీ ప్రకటించిందని..  దీనిపై వివరణ ఇచ్చేందుకు తనకు గడువు కావాలని కోరగా.. కోర్టు మూడు వారాల గడువిచ్చింది.

విజయ్ మాల్యా తరఫు న్యాయవాది ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసుపై స్పందించడానికి తమకు మరికొంత సమయం కావాలని కోరారు. తాను మారిషస్ చిరునామా ఇచ్చినప్పటికీ కొన్ని నోటీసులను అందుకోలేదని.. అందుకే సమయం ఇవ్వాలని ముంబై పీఎంఎల్ఏ కోర్టును అడిగారు. అయితే దీనిపై స్పందించిన ఈడీ తరఫు లాయర్..  చట్టప్రకారం దరఖాస్తుపై స్పందించడానికి విజయ్ మాల్యాకు ఎక్కువ సమయం ఇవ్వలేమని వాదించారు.

వాద.. ప్రతివాదనలు విన్న తర్వాత ప్రత్యేక కోర్టు విజయ్ మాల్యా దరఖాస్తును స్వీకరించింది. ఈడీ కేసుల్లో వివరణ ఇచ్చేందుకు విజయ్ మాల్యాకు న్యాయస్థానం 3 వారాల గడువిచ్చింది. ఈనెల 24వతేదీ వరకు విజయ్ మాల్యాకు న్యాయస్థానం గడువిచ్చింది. 24వ తేదీ తర్వాత కోర్టు తీర్పును వెల్లడించనుంది.

మరోవైపు.. మాల్యా భారత్‌కు తిరిగిరానున్నారని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. మాల్యా.. భారత్‌లో న్యాయ విచారణకు సహకరించేందుకు సిద్ధమేనని, భారత్‌కు తిరిగివస్తానన్న సంకేతాలను అధికార వర్గాలకు పంపుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారులు స్పష్టతనివ్వడం లేదు.  మాల్యా.. ఇదివరకే తనకు అవకాశమివ్వాలని ఏప్రిల్ 15,2016లో మోదీకి, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసినట్లు.. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని గతంలో నివేదికలు వెలువడ్డాయి. 

 

Trending News