Food Items: రాత్రి 7 తర్వాత ఈ ఫుడ్ ఐటమ్స్ అస్సలు తినోద్దు.. నిపుణులు ఏమంటున్నారంటే..?

Dinnar food: చాలా మంది రాత్రిళ్లు ఇష్టమున్నట్లు తింటుంటారు. కొందరు లేట్ నైట్ లలో కూడా డిన్నర్ చేస్తుంటారు. కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : May 19, 2024, 05:58 PM IST
  • రాత్రిపూట తినకూడని ఫుడ్ స్టఫ్..
  • జీవక్రియలు పాడైపోతుందంటున్న నిపుణులు..
Food Items: రాత్రి 7 తర్వాత ఈ ఫుడ్ ఐటమ్స్ అస్సలు తినోద్దు.. నిపుణులు ఏమంటున్నారంటే..?

Avoid these food stuff after 7 pm: ప్రతీ ఒక్కరు ఉరుకుల పరుగుల మీద జీవనం సాగిస్తున్నారు. చాలా మంది సమయానికి తినకుండా ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ ఆఫీసు టైమింగ్ లు కూడా పూర్తిగా వేర్వేరు సమయాలలో ఉంటున్నాయి. దీని వల్ల కొందరు నైట్ షిప్ట్ లు చేస్తుంటే, మరికొందరు డే షిఫ్ట్ లు చేస్తున్నారు. దీని వల్ల జీవ గడియారం పూర్తిగా పాడైపోతుంది. టిఫిన్ లను స్కిప్ చేయడం చేస్తుంటారు. లంచ్ చేసే సమమంలో టిఫిన్ లను తింటుంటారు. ఇక రాత్రికి డిన్నర్ ఏ పడుకునే ముందు తింటుంటారు. దీని వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థ పూర్తిగా పాడౌపోతుంది.  ఇలా ఇష్టమున్నట్లు ఫుడ్ ఐటమ్స్, నచ్చిన సమయానికి తినడం వల్ల లేని పోనీ ఆరోగ్య సమస్యలు వచ్చిపడుతున్నాయి. 

Read more: Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..

సమయ పాలన పాటించక పోవడం..

చాలా మంది టైమ్ ప్రకారం ఫుల్ లను అస్సలు తీసుకొవడంలేదు. దీని వల్ల శరీరంలో ఆ సమయానికి కొన్నిరకాల రసాయనాలు విడుదలౌతాయి. వీటికి కావాల్సిన ఫుడ్ లను జీర్ణంచేయడం ఆ రసాయనాల పని. మనం ఫుడ్ తీసుకొక పోవడం వల్ల అవి అంతర్గత అవయవాలపై ప్రభావం చూపిస్తాయి. అందుకు మనకు కొన్నిసార్లు కడుపులోపల మంటగా అన్పిస్తుంటుంది. వేడి పదార్థాలు, కారం పదార్థాలు తినగానే అబ్ నార్మల్గా అనిపిస్తుంటుంది.

ఇష్ట మున్న ఫుడ్ ఐటమ్స్ తినడం..

నార్మల్ గా చాలా మంది ఉదయం పూట ఏదైన టిఫిన్ ఐటమ్స్ తింటుంటారు. కానీ కొందరి జీవన విధానం పూర్తిగా అబ్ నార్మల్ గా ఉంటుంది. ఉదయంపూట చైనీస్ ఫుడ్ లు,  ఫాస్ట్ ఫుడ్ లను తింటుంటారు. టీ లు, కాఫీలు తాగుతూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు.  జంక్ ఫుడ్ లను తినడం వల్ల శరీరంలో జీర్ణక్రియ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. దీనివల్ల అనేక ప్రభావాలు మన శరీరంలో కన్పిస్తాయి. 

జీవక్రియ రేటు దెబ్బతినడం..

మన శరీరంలో కొన్ని జీవక్రియలు ఉంటాయి. ఇవి సక్రమంగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. పోషణ, శ్వాసక్రియ, విసర్జన, రవాణ, ప్రత్యుత్పత్తి మొదలైన జీవన క్రియలు ఉంటాయి. వీటిల్లో ఏది సరిగ్గా పనిచేయకున్న మనం తొందరగా వ్యాధుల బారిన పడుతుంటాం. అందుకు మనం ఆహారంగా తీసుకునే ప్రతిఒక్క పదార్థం మనపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతుంటారు.

రాత్రిపూట తినకూడని పదార్థాలు..

ముఖ్యంగా రాత్రిపూట కొన్ని పదార్థాలు తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతిని పొత్తికడుపులో నొప్పి ఏర్పడుతుంది. ముఖ్యంగా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీల వంటి వాటిని రాత్రిపూట అస్సలు తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి తొందరగా జీర్ణం కావు. అంతేకాకుండా.. వీటిలో ఉండే ఘాటు వల్ల పొట్టలో స్టమక్ రిలేటేడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. 

Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?

కొందరిలో చికెన్, మటన్ తినగానే పొట్ట ఉబ్బినట్టుగా ఉంటుంది.  వాంతులు, విరేచనాలు కూడా కల్గుతాయి. ఇక చైనీస్ ఫుడ్, స్పైసీ ఫుడ్ లను రాత్రిపూట ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. అదే విధంగా శెనక పిండితో చేసిన పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. కెఫిన్ లు ఎక్కువగా ఉండే కాఫీలు, టీలకు కూడా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి తీసుకోవడం వల్ల మననిద్రను ప్రభావితం చేస్తాయి. మనిషికి కంటినిండా సరిపడా నిద్రలేకుంటే అనేక రకాలు సమస్యలు వస్తాయి.  అందుకే రాత్రిపూట ఈ పదార్థాలను అస్సలు తినొద్దని నిపుణులు చెప్తున్నారు. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News