Dehydration Symptoms: రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. డీహైడ్రేషన్ నుంచి జాగ్రత్త పడండి!

Dehydration Symptoms: వేసవిలో చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. శరీరంలో నీటి శాతం తగ్గుదల కారణంగా ఈ డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలతో డీహైడ్రేషన్ నుంచి దూరంగా ఉండొచ్చు. అదెలాగో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2022, 04:57 PM IST
Dehydration Symptoms: రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. డీహైడ్రేషన్ నుంచి జాగ్రత్త పడండి!

Dehydration Symptoms: దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. మార్చి మొదటి వారం నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి మరింత పెరుగుతున్న కారణంగా చాలా మంది డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటున్నారు. శరీరంలో తగిన మోతాదులో నీరు శాతం లేకపోవడం వల్ల ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

డీహైడ్రేషన్ యొక్క లక్షణాలు ఏమిటి?

శరీరంలో నీటి కొరత ఏర్పడితే డీహైడ్రేషన్ బారిన పడతారు. వేసవిలో శరీరం నుంచి నీటి శాతం చెమట లేదా మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ఈ విధంగా నీరు బయటకు వెళ్తోన్న నేపథ్యంలో శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా.. ఎప్పటికప్పుడు నీటిని తాగుతుండాలి. 

డీహైడ్రేషన్ వల్ల మరణానికి సంభవించవచ్చు!

డీహైడ్రేషన్ కు గురైన సమయంలో శరీరానికి తగిన నీటి శాతం లభించకపోతే వడదెబ్బకు గురవుతారు. ఈ వడదెబ్బ కారణంగా మనిషి చనిపోయే అవకాశం ఉంది. అయితే డీహైడ్రేషన్ ను మీరు ముందే గమనించవచ్చు. డీహైడ్రేషన్ బారిన పడే ముందు తల తిరగడం, తలనొప్పి వంటి లక్షణాలను కలిగి ఉంటారు. 

వేసవి నీరు ఎక్కువగా తాగాలి! 

శరీరంలో నీటి శాతం ఎక్కువ. దీని లోపం వల్ల చర్మం పొడిబారుతుంది. పెదవులు పొడిగా మారి పగుళ్లు ఏర్పడతాయి. కనీసం నాలుగు గంటలకు ఒకసారి మూత్ర విసర్జన చేయకపోతే వారు డీహైడ్రేషన్ కు గురయ్యారని అవగాహనకు రావొచ్చు. మహిళలు రోజుకు కనీసం 2.5 లీటర్ల నీరు త్రాగాలి. మరోవైపు పురుషులు కూడా రోజుకు కనీసం 3 లీటర్ల నీరు త్రాగాలి.

డీహైడ్రేషన్ కు చికిత్స

డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న వ్యక్తి నిమ్మరసం, కొబ్బరి నీరు లేదా మజ్జిగ వంటి వాటిని ఇవ్వాలి. డీహైడ్రేషన్ కు గురైన వ్యక్తి నీడలో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. మీరు జిమ్ లో కఠినమైన వ్యాయామాలు చేసేందుకు అలవాటు పడితే వేసవిలో కనీసం 15 నుంచి 20 నిమిషాలకు ఒకసారి కొద్దికొద్దిగా ద్రవపదార్థాలను తీసుకుంటూ ఉండాలి. 

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)    

Also Read: iPhone Factory Reset: ఐఫోన్ ను రీసెట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ సులభమైన టిప్స్ తెలుసుకోండి!

Also Read: Holi Festival Precautions: ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు హోలీ జరుపుకోకపోవడమే మంచిది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News