Fake Rape Case: అత్యాచారం చేశాడని ఊరికే చెప్పా.. యువతికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు..స్టోరీ ఏంటంటే..?

Uttar pradesh: ఒక యువతి సరదాగా చేసిన పనికి యువకుడు బలయ్యాడు. తన జీవితంలోని నాలుగేళ్లు జైలులోనే ఉండాల్సి వచ్చింది. సమాజంలో సదరు యువకుడు, అతనికుటుంబం నేరం చేసిన వాళ్లలాగా అందరి ముందు తలదించుకొని ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనలో తాజాగా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

Written by - Inamdar Paresh | Last Updated : May 6, 2024, 02:26 PM IST
  • కోర్టులో సీరియస్ అయిన న్యాయమూర్తి..
  • తల్లి, కూతుళ్లను కఠినంగా పనిష్మెంట్ చేయాలని ఆదేశాలు..
Fake Rape Case: అత్యాచారం చేశాడని ఊరికే చెప్పా.. యువతికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు..స్టోరీ ఏంటంటే..?

Woman jailed for false rape claim court serious and fined 5.9lakhs in uttar pradesh: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, అమ్మాయిల భద్రత కోసం అనేకచట్టాలు తీసుకొచ్చాయి. ముఖ్యంగా మహిళలు ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్న కూడా పోలీసులకు ఫిర్యాదులు చేస్తుంటారు. దీనిలో మహిళలకు అనేక వేసులు బాటులు కూడా కల్పించారు. అత్తాగారింట్లో వేధింపులు లేక సమాజంలో లైంగిక వేధింపులు, ఎక్కడైన పరాయి పురుషులతో లేదా మరే సంఘటనలలోనైన ఇబ్బందులు ఎదుర్కొంటే పోలీసులకు ఫిర్యాదులు చేయవచ్చు. కానీ కొందరు మహిళలు మాత్రం..ఈ చట్టాలను పూర్తిగా తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. చట్టాన్ని, కోర్టులను తప్పుదోవపట్టిస్తున్నారు. ఇటీవల కొందరు మహిళలు కూడా భర్తలతో గొడవడు పడుతున్నారు. వారు చెప్పినట్లు వినాలని, వేధిస్తున్నారు. ఒక వేళ వారు చెప్పినట్లు అత్తాగారింట్లో వినకపోతే వేధింపులు కేసు పెడుతామంటూ రివర్స్ లో వేధిస్తున్నారు. భర్త, అత్తామామలపై నిరాధరరమైన ఆరోపణలు చేస్తున్నారు.

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

మరికొందరు అమ్మాయిలైతే.. మరీనీచంగా తాము చెప్పినట్లు చేయకపోతే.. అత్యాచారంకు ప్రయత్నించావని, చెడుగా మాట్లాడవని ఫిర్యాదులు చేస్తామంటూ రివర్స్ లో అబ్బాయిలను ఇబ్బందులుకు గురిచేస్తున్నారు. ఇలాంటి సందర్భాలలో సమాజంలో ఎవరైన అమ్మాయిలవైపు ఉంటారు.. వారు చివరకు ఏడ్చేసి నానారచ్చ చేస్తారు. దీంతో పోలీసులు, ఎవరు కూడా వారు చేస్తున్న ఆరోపణలు కాదని చెప్పలేరు. దీన్ని కొందరు తమ ఆయుధంగా భావించుకుని నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఈ కోవకుచెందిన ఘటన ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో చోటు చేసుకుంది. బరాదారి పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2019 లో అజయ్ అనే వ్యక్తి తన కూతురును ఢిల్లీకి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి అత్యాచారంచేశాడని తల్లి ఆరోపించింది.

అంతేకాకుండా.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న  పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి యువకుడు రిమాండ్ లో ఉన్నాడు. కేసు పెండింగ్ లో ఉంది. తాజాగా, కోర్టు ఇటీవల దీనిపై విచారణ చేపట్టింది.  ఈక్రమంలో యువతి.. తాను ఉద్దేశపూర్వకంగానే యువకుడు అత్యాచారం చేసినట్లు చెప్పానని న్యాయమూర్తిముందు అంగీకరించింది. దీంతో ఆయన దీనిపై తీవ్రంగా స్పందించారు. సదరు యువతి పనుల వల్ల.. యువకుడు.. నాలుగు సంవత్సరాల ఆరునెలల 13 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది.

Read more: Chennai Child Rescued: వావ్.. అందరూ కలిసి బుడ్డోడీని భలే కాపాడారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..

అతని జీతితంలో విలువైన సమయం కోల్పోయాడు. అసత్య ఆరోపణలు చేసిన యువతికి ,ఆమె తల్లికి కూడా ఇదే విధంగా నాలుగేళ్లపాటు జైలులో ఉండాలని కోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా.5,88,822 రూ,ల జరిమాన కూడా కట్టాలని కోర్టు ఆదేశించింది. ఒక వేళ జరిమాన కట్టకుంటే మరో ఆరునెలల పాటు జైలు పనిష్మెంట్ విధించాలని కూడా న్యాయమూర్తి తన తీర్పును వెల్లడించారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News