Mamata Banerjee: గవర్నర్ బాగోతాల పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది.. ఎన్నికల వేళ బాంబు పేల్చిన మమత బెనర్జీ..

West bengal news: వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ సి.వి. ఆనంద పై కు సంబంధించిన లైంగిక వేధింపుల పెన్ డ్రైవ్ తన దగ్గర ఉందన్నారు. గవర్నర్ కొన్ని ఎడిట్ చేసిన వీడియోలను సాధారణ పౌరులకు చూపించారని మండిపడ్డారు.  

Written by - Inamdar Paresh | Last Updated : May 12, 2024, 03:47 PM IST
  • వెస్ట్ బెంగాల్ లో దాదాగిరి చెల్లదు..
  • మరోసారి గవర్నర్ పై మండిపడిన మమతా
Mamata Banerjee: గవర్నర్ బాగోతాల పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది.. ఎన్నికల వేళ బాంబు పేల్చిన మమత బెనర్జీ..

West bengal cm mamata banerjee fires on governor cv ananda bose: ఎన్నికల వేళ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మమతా బెనర్జీ.. టీఎంసీ తరపున హుగ్లీ లోక్ సభ స్థానానికి బరిలో ఉన్న రచనా బెనర్జీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. సి.వి. ఆనంద బోస్ కు చెందిన లైంగిక వేధింపుల వీడియో తన దగ్గర ఉందని అన్నారు. ఆయన గవర్నర్ గా ఉన్నంత కాలం రాజ్ భవన్ కు వెళ్లనని మండిపడ్డారు. ఆనంద్ బోస్ ఎడిట్ చేసిన వీడియోలను ప్రజలకు చూపిస్తున్నారని, అస్సలైన వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ తన దగ్గర ఉందని, దానిలో ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ ఉన్నాయంటూ ప్రచారంలో గవర్నర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?

అంతేకాకుండా.. సి.వి. ఆనంద్ బోస్ పక్కన కూర్చోవడం కూడా తనకు ఇష్టంలేదంటూ ఎద్దేవా చేశారు. గవర్నర్.. తనపై వ్యాఖ్యలు చేస్తూ.. వెస్ట్ బెంగాల్ లో దీదీగిరి చెల్లదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన దాదాగిరి కూడా ఇక్కడ నవడనీయ్యనంటూ మమతా  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. గవర్నర్ ఆనంద్ బోస్ తన కార్యాలయంలో ఒక యువతిని లోబర్చుకుని జాబ్ ఇప్పిస్తానంటూ లైంగికంగా వేధించాడని ఆరోపించింది. కొన్నిరోజులుగా ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లో తీవ్ర దుమారంగా మారింది. మరోవైపు రాజ్ భవన్ దీన్ని పూర్తిగా కొట్టిపారేసింది. ఇది కేవలం గవర్నర్ పేరును బద్నాం చేసేందుకు కుట్రలో భాగమని ఎక్స్ వేదికగా స్పందించారు. అదే విధంగా గవర్నర్ ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. ఎన్నికలలో లబ్ధి పొందేందుకు బీజేపీ పై, కేంద్రం నియమంచిన గవర్నర్ లపై మమతా.. ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని స్థానిక నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వెస్ట్ బెంగాల్ పోలీసులు కూడా దీనిపై గవర్నర్ కార్యలయానికి నోటీసులు జారీ చేశారు. దీనిపై గవర్నర్ కార్యాలయం కూడా అంతే ఘాటుగా స్పందించింది.

Read More: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...

పదవిలో ఉండగా.. గవర్నర్, రాష్ట్రపతిలపై రాజ్యంగం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకునేందుకు హక్కులు ఉండదంటూ గవర్నర్ ఆఫీస్ స్పష్టం చేసింది. దేశంలో ఎన్నికల జరుగున్న నేపథ్యంలో.. కావాలని బీజేపీపై మమతా లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.  ఇక వెస్ట్ బెంగాల్ లో సందేశ్ ఖలీ ఉదంతం తీవ్ర దుమారంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బీజేపీ, మమతా సర్కారుపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. గవర్నర్ సి.వి. ఆనంద్ బోస్ కూడా మమతా తీరును తప్పుపట్టారు. ఇక ఈ ఉదందంతో సీఎం మమతా బెనర్జీ, గవర్నర్, బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.

 

  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News