Gorakhpur Road Accident: ఘోరం.. రోడ్డుపైన నడుస్తున్న వారిని గుద్ది చంపారు.. వీడియో వైరల్

Road Accident Video Viral: ముగ్గురు యువకులు భోజనం చేసి తమ దారిన తాము పోతున్నారు. ఇంతలో ఒక కారు వేగంగా వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు కూడా గాల్లో ఎగిరి కిందపడిపోయారు. వీరి నుంచి కారు స్పీడ్ గా వెళ్లిపోయింది. ఈ ఘటనకు చెందని వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 12, 2024, 12:44 PM IST
  • యూపీలో రోడ్డుమీద అర్ధరాత్రి కారు బీభత్సం..
  • అమాయకులపై దూసుకెళ్లిన కారు..
Gorakhpur Road Accident: ఘోరం.. రోడ్డుపైన నడుస్తున్న వారిని గుద్ది చంపారు.. వీడియో వైరల్

Gorakhpur Road Accident Video Viral: కొందరు రోడ్ల మీద ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపిస్తుంటారు. తాగి వాహనాలు నడిపిస్తుంటారు. రోడ్డుపైన రాంగ్ రూట్ లలో వెళ్లు ఇతరులకు ఇబ్బంది కల్గచేస్తుంటారు. ఇలాంటి క్రమంలో వాహన ప్రమాదాలు చేస్తుంటారు. కొన్నిసార్లు ఇలాంటి ఘటనలలో  ప్రాణాలు పోయిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. వాహనాలు నడిపిచ్చేటప్పుడు.. సరిగ్గా డ్రైవింగ్ చేయకపోవడం వల్ల వీళ్లు ప్రమాదంలో పడటమే కాకుండా.. ఇతరులను కూడా ప్రమాదంలో నెట్టేస్తుంటారు. ఇలాంటి క్రమంలో రోడ్డుపైన వెళ్తున్న అమాయకులు బలి అవుతుంటారు. సిగ్నల్ ను పాటించకుండా డ్రైవింగ్ చేస్తుంటారు. రాంగ్ రూట్ లలో వాహనాలు నడిపిస్తుంటారు.

 

ఇలాంటి పనులు చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమౌతుంటారు. ఇలాంటి వ్యక్తుల వల్ల.. అమాయకులు బలైన అనేక సంఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, ఈ కోవకు చెందిన మరో ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. 

ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఆదివారం అర్ధరాత్రి రామ్ నగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వైరల్ గా మారింది. అక్తర్, అకిల్, తాహిర్ రెస్టారెంట్ లో భోజనం చేసి తమ దారిన తాము వెళ్తున్నారు. ఇంతలో వేగంగా ఒక కారు వెనుక నుంచి వీరిని స్పీడ్ గా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ముగ్గురు గాల్లో బంతిలాగా ఎగిరిపడ్డారు. కారు వీరి మీది నుంచి వెళ్లిపోయింది.  ఈ ప్రమాదంలో అక్తర్, అకిల్ సంఘటన స్థలంలోనే మరణించారు.

Read More: Matric Exam Paper Viral: ప్లీజ్ సార్ .. నన్ను పాస్ చేయండి.. లేకుంటే పెళ్లి చేస్తారు.. వైరల్ గా మారిన యువతి ఎగ్జామ్ పేపర్..

మరో యువకుడు తాహిర్ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వెంటనే స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. తాహిర్ ను వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేశారు. సంఘటన స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.  ఇద్దరు బాధితుల మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించారు. కారు ప్రమాదం జరిపిన కేటుగాడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News