Supreme court collegium: సుప్రీంకోర్టు కొలిజీయంపై మరో వివాదం, కులాల కుంపటి రాజేసినట్టేనా

Supreme court collegium: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్ర న్యాయశాఖ ప్రతి సందర్భంలోనూ వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. ఈసారి ఏకంగా కులాల కుంపటే రాజేసింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 2, 2023, 03:39 PM IST
Supreme court collegium: సుప్రీంకోర్టు కొలిజీయంపై మరో వివాదం, కులాల కుంపటి రాజేసినట్టేనా

సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ మరోసారి వివాదాస్పదంగా మారింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే పలు సందర్భాల్లో కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పార్లమెంటరీ కమిటీకు సమర్పించిన నివేదిక మొత్తం అంశాన్ని వివాదం చేస్తోంది. 

సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను..సుప్రీంకోర్టు తప్ప అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడిదే అంశంపై కేంద్ర న్యాయశాఖ పార్లమెంటరీ కమిటీకు సమర్పించిన నివేదిక కొత్త వివాదాన్ని రాజేస్తోంది. న్యాయమూర్తుల నియామకంలో  సామాజిక న్యాయం పాటించడం లేదనేదే ఈ కొత్త వివాదం. కేంద్ర న్యాయశాఖ నివేదిక ద్వారా కులాల కుంపటిని సైతం రాజేసింది. 

కొలీజియం వ్యవస్థ ప్రవేశపెట్టి 30 ఏళ్లైనా..న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం లోపించిందని కేంద్ర న్యాయశాఖ తెలిపింది. గత ఐదేళ్లలో హైకోర్టులో నియమితులైన న్యాయమూర్తుల్లో..ఓబీసీలు కేవలం 15 శాతమే ఉన్నారని వెల్లడించింది. అందరి ప్రాతినిధ్యం ఉండేలా న్యాయవ్యవస్థ రూపొందించే ఆకాంక్ష నెరవేరలేదన్నారు. 

షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు, మహిళల్నించి అర్హులైన అభ్యర్ధుల్ని సిఫారసు చేయాల్సిన బాధ్యత కొలీజియందేనని కేంద్ర న్యాయశాఖ తెలిపింది.  2018 నుంచి 2022 డిసెంబర్ వరకూ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు 537 ఉన్నాయి. ఇందులో ఎస్టీలు 1.3 శాతం, ఎస్సీలు 2.8 శాతం, ఓబీసీలు 11 శాతం, మైనార్టీలు 2.6 శాతం ఉన్నారని కేంద్ర న్యాయశాఖ వివరించింది. 

Also read: SC Demonetisation Judgement: పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News