Supreme Court: ఎన్నికల సంఘం నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ థాక్రే

Supreme Court: మహారాష్ట్ర శివసేన పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించడంపై ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 20, 2023, 02:37 PM IST
Supreme Court: ఎన్నికల సంఘం నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ థాక్రే

మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే వర్సెస్ ఏక్‌నాథ్ షిండే పంచాయితీ రోజురోజుకూ ముదురుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షాక్ తో ఉద్ధవ్ థాక్రే వర్గానికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉద్ధవ్ థాక్రే వర్గం ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

మహారాష్ట్రలో శివసేన రెబెల్ నేత ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేయడం, ఆ తరువాత బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇక ఆ తరువాత జరిగిన పరిణామాల్లో శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు కోసం తిరుగుబాటు వర్గమైన ఏక్‌నాథ్ షిండే వర్సెస్ ఉద్ధవ్ థాక్రే వర్గానికి పోరు ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఏక్‌నాథ్ షిండే వర్గాన్నే అసలైన శివసేన పార్టీగా గుర్తించి..ఆ వర్గానికి పార్టీ ఎన్నికల గుర్తు విల్లు బాణంను కేటాయించింది. అసెంబ్లీ ఉప ఎన్నికలు పూర్తయ్యేవరకూ థాక్రే వర్గానికి మంటలు మండుతున్న టార్చ్ గుర్తు అంటే కాగడాను కేటాయించింది. 

2019 మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచిన 55 మంది శివసేన ఎమ్మెల్యేలకు అనుకూలంగా పోలైన ఓట్లలో 75 శాతం ఓట్లు షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు లభించాయని..థాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు 23.5 శాతం లభించాయని ముగ్గురు సభ్యుల కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో ఉద్ధవ్ థాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉద్ధవ్ థాక్రే తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పిటీషన్ దాఖలు చేయడమే కాకుండా..ముందస్తు జాబితాగా నోటిఫై చేయాలని కోరారు. ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఇందుకు నిరాకరించింది.

నియమాలు అనేవి ఇటూ అటూ కాకుండా అందరికీ సమానంగా ఉంటాయని..సరైన ప్రక్రియతో రేపు రావాలని ధర్మాసనం తెలిపింది. మరోవైపు శివసేన థాక్రే వర్గం ముంబైలోని పార్టీ కార్యాలయంలో సమావేశమైంది. అటు షిండే కూడా తన వర్గం ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. 

Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనంజా.. ఒకేసారి భారీగా నగదు జమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News