Mimi Chakraborty: ఎంపీ, నటితో అసభ్యకరంగా ప్రవర్తించిన ట్యాక్సీ డ్రైవర్

బెంగాలీ నటి, పార్లమెంటు సభ్యురాలు మిమీ చక్రవర్తి లైంగిక వేధింపులకు గురయ్యారు. ఆమె తన కారులో ప్రయాణిస్తుండగా.. నడిరోడ్డుపై ఓ ట్యాక్సీ డ్రైవర్ మిమీ చక్రవర్తితో అసభ్యకరంగా ప్రవర్తించాడు.

Last Updated : Sep 15, 2020, 03:53 PM IST
Mimi Chakraborty: ఎంపీ, నటితో అసభ్యకరంగా ప్రవర్తించిన ట్యాక్సీ డ్రైవర్

Taxi driver arrested for misbehaving with MP Mimi Chakraborty: న్యూఢిల్లీ: బెంగాలీ నటి, పార్లమెంటు సభ్యురాలు మిమీ చక్రవర్తి లైంగిక వేధింపులకు గురయ్యారు. ఆమె తన కారులో ప్రయాణిస్తుండగా.. నడిరోడ్డుపై ఓ ట్యాక్సీ డ్రైవర్ మిమీ చక్రవర్తితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం కోల్‌కతాలో జరగగా.. నటి ఫిర్యాదు మేరకు.. ట్యాక్సీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రం మిమీ చక్రవర్తి కోల్‌కతాలోని గరియాహాట్ నుంచి బాలిగంజ్ పారి ఏరియా వైపు వెళుతుండగా.. ట్రాఫిక్ సిగ్నల్ ఓ టాక్సీడ్రైవర్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేశాడు. ఆ టాక్సీ నెంబర్ ఆధారంగా మిమీ చక్రవర్తి గరియా హాట్ పోలీస్‌స్టేషన్‌లో డ్రైవర్ పై ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి నిందితుడు ఆనందపూర్‌కు చెందిన లక్ష్మణ్ యాదవ్‌గా గుర్తించి పట్టుకున్నారు.దీంతోపాటు ఆ డ్రైవర్‌పై లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసారు. Also read: Kangana Ranaut: అప్పుడు ఇలానే మాట్లాడేవారా? జయబచ్చన్‌పై కంగనా సీరియస్

అయితే.. మిమీ చక్రవర్తి బెంగాలీ నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆమె పలు చిత్రాలతోపాటు.. టీవీ షోలల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా ఆమె బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (TMC)  ఎంపీగా గెలిచి ప్రజలకు సేవలందిస్తున్నారు. Also read: Chiranjeevi: మెగాస్టార్ గుండు లుక్ సిక్రెట్ ఇదే..

Trending News