Article 370: జమ్ము కశ్మీర్ ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు నేడే

Article 370: దేశంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370పై ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు నేడు వెలువడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 11, 2023, 09:04 AM IST
Article 370: జమ్ము కశ్మీర్ ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు నేడే

జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ ఇప్పటికే పూర్తయింది. ఇవాళ ఈ కీలక అంశంపై తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

జమ్ము కశ్మీర్ భారతదేశంలో విలీనం సమయంలో అప్పటి సంస్థానాధిపతులతో కుదిరిన ఒప్పందం మేరకు ఆ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 370 చేర్చారు. నాలుగున్నరేళ్ల క్రితం అంటే 2019 ఆగస్టు 6న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసింది. ఈ రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం అన్ని వర్గాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుంది. 

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఇవాళ తీర్పు వెలువడనున్న క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా జమ్ము కశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కొందరిని అదుపులో తీసుకోగా, మరి కొందరిని గృహ నిర్బంధం చేశారు. 2 వారాల ముందు నుంచే కశ్మీర్ లోయలో పెద్దఎత్తున పోలీసు బలగాల్ని మొహరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 10 జిల్లాలు పూర్తిగా పోలీసుల నియంత్రణలో ఉన్నాయి. 

ఆర్టికల్ 370 రద్దు విషయంలో కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తీర్పు ఎలా వచ్చినా అందరూ గౌరవించాలని బీజేపీ కోరింది. మరోవైపు తీర్పు తమకు అనుకూలంగా రాకున్నా సంయమనం పాటిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5న తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఇవాళ వెలువరించనుంది. అందుకే సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Also read: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌పై తొలగిన సస్పెన్స్, ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్, స్పీకర్ పదవిలో మాజీ సీఎం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News