Supreme Court: సుప్రీంకోర్టు చరిత్రలో మూడవసారి మహిళా ధర్మాసనం, 32 పిటీషన్లపై విచారణ

Supreme Court: సుప్రీంకోర్టు చరిత్రలో మరోసారి మహిళా న్యాయముర్తుల ధర్మాసనం ఏర్పాటైంది.  కేసుల విచారణలో భాగంగా మొత్తం మహిళలతోనే ఉన్న బెంచ్ ఏర్పడటం ఇది మూడవసారి. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 1, 2022, 06:41 PM IST
Supreme Court: సుప్రీంకోర్టు చరిత్రలో మూడవసారి మహిళా ధర్మాసనం, 32 పిటీషన్లపై విచారణ

సుప్రీంకోర్టు చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇద్దరు మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ బెంచ్ ఇవాళ 10 బెయిల్ పిటీషన్లు, పది పెళ్లి వివాదాల పిటీషన్లను విచారించింది. 

సుప్రీంకోర్టులో మూడోసారి మహిళా న్యాయమూర్తుల ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బెలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం మొత్తం 32 పిటీషన్లను విచారించింది. ఇందులో పది పిటీషన్లు వివాహ వివాదాలకు సంబంధించినవి కాగా..10 పిటీషన్లు బెయిల్‌కు సంబంధించినవి. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్న 27మంది న్యాయమూర్తుల్లో ముగ్గురు మహిళా న్యాయమూర్తులున్నారు. వీరిలో జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ త్రివేది ఉన్నారు. వీరిలో జస్టిస్ హిమా కోహ్లి పదవీకాలం 2024 సెప్టెంబర్ నెలతో ముగియనుండగా..జస్టిస్ త్రివేది పదవీకాలం 2025 జూన్‌తో పూర్తవుతుంది. ఇక జస్టిస్ నాగరత్నం 2027లో తొలి మహిళా సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి.

గతంలో ఎప్పుడెప్పుడు

సుప్రీంకోర్టులో తొలిసారి 2013లో జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ బెంచ్ ఏర్పాటైంది. ఆ తరువాత 2018లో జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం ఏర్పాటైంది. ఇవాళ మూడవసారి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ త్రివేదిలతో మహిళా బెంచ్ ఏర్పాటైంది. 

Also read: Telangana Medical College: తెలంగాణ మెడికల్‌ కాలేజీల్లో భారీగా పోస్టుల భర్తీ.. ఒక్కో కళాశాలకు 433 పోస్టులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News