Venkaiah Naidu Farewell: ప్రధాని మోడీ ఉద్వేగం.. వెంకయ్య కన్నీళ్లపర్వం! రాజ్యసభలో ఘనంగా వీడ్కోలు

Venkaiah Naidu Farewell: భారత నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధనకర్ గెలిచారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు పదవి కాలం ఈనెల 10వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో వెంకయ్యనాయుడుకి వీడ్కోలు నిర్వహించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు చర్చలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ ఉద్వేగానికి లోనయ్యారు.

Written by - Srisailam | Last Updated : Aug 8, 2022, 01:57 PM IST
  • రాజ్యసభలో వెంకయ్యకు వీడ్కోలు
  • వెంకయ్యను కొనియాడిన ప్రధాని మోడీ
  • రాజ్యసభ గౌరవాన్నిపెంచారు- మోడీ
Venkaiah Naidu Farewell: ప్రధాని మోడీ ఉద్వేగం.. వెంకయ్య కన్నీళ్లపర్వం! రాజ్యసభలో ఘనంగా వీడ్కోలు

Venkaiah Naidu Farewell: భారత నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధనకర్ గెలిచారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు పదవి కాలం ఈనెల 10వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో వెంకయ్యనాయుడుకి వీడ్కోలు నిర్వహించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు చర్చలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ ఉద్వేగానికి లోనయ్యారు. పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు వెంకయ్య నాయుడికి ప్రధాని అభినందనలు తెలిపారు. వెంకయ్యనాయుడు అత్యంత జనాదరణ ఉన్న నాయకుడని చెప్పారు. అనేక బాధ్యతలను వెంకయ్య సమర్థంగా నిర్వహించారని ప్రధాని మోడీ కొనియాడారు. ఆ సందర్భంగా వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టారు.

పదవులకే వెంకయ్య వన్నె తెచ్చారని ప్రధాని మోడీ అన్నారు.సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వెంకయ్య  బీజేపీ అధ్యక్షుడు సహా అనేక పదవులు చేపట్టారని మోడీ కొనియాడారు. పాత తరం నాయకులతో పాటు కొత్త తరానికి  వెంకయ్య నాయుడు అనుసంధానమయ్యారని తెలిపారు.యువ ఎంపీలను ఆయన ప్రోత్సహించారని చెప్పారు.వెంకయ్యతో కలిసి పనిచేసే అదృష్టం తనకు లభించిందని ప్రధాని మోడీ అన్నారు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, ఉప రాష్ట్రపతిగా ఆయన అత్యంత సమర్థవంతంగా పని చేశారని చెప్పారు.  వెంకయ్య  నాయుడు పని విధానం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. ఆయన పనితీరు అందరికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు ప్రధాని మోడీ. వెంకయ్య నుంచి సమాజం, ప్రజాస్వామ్యం ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. ప్రజలతో మమేకయ్యే భాష ఆయన సొంతమన్నారు. ప్రజలకు సులభంగా అర్దమయ్యేలా వెంకయ్య చెబుతారని చెప్పారు. పేద ప్రజల కోసం ఆయన ఎంతో తపించేవారన్నారు. వెంకయ్య  లైనర్లు కూడా విట్ లైనర్స్ అని ప్రధాని మోడీ అన్నారు.  భాషల మీద అతని కమాండ్ అద్భుతమన్నారు. తన పనితీరుతో రాజ్యసభ  గౌరవాన్నిపెంచారన్నారు. రాజ్యసభ సచివాలయంలో ఎన్నో మార్పులు తెచ్చారని చెప్పారు.

వెంకయ్య నాయుడు తొమ్మిది కోట్ల మంది తెలుగుప్రజలు ఆణిముత్యం అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆయన నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.

Also Read: Priya Prakash Varrier: ఏకంగా బాత్రూంలో ఫోటోలు షేర్ చేసిన ప్రియా ప్రకాష్.. అలా పడుకుని మరీ అందాల విందు!

Also Read: Radhana Ram: ఇండస్ట్రీకి మరో వారసురాలు..ఏకంగా పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News