NOTA: నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికలను రద్దు చేయాల్సిందేనా..? సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం..

NOTA: 2024 18వ లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళలో సుప్రీంకోర్టులో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు ఏం చేయాలన్న దానిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 27, 2024, 07:53 AM IST
NOTA: నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికలను రద్దు చేయాల్సిందేనా..? సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం..

NOTA: ఎన్నికల్లో తమకు ఏ అభ్యర్ధి నచ్చకపోతే నోటాకు ఓటు వేసే అవకాశాన్ని ఓటర్లకు సుప్రీంకోర్టు 2013లో కల్పించింది. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) అప్పట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టులో ఓటింగ్ యంత్రాల్లో నోటాను ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో పోటీ చేసే క్యాండిడేట్స్‌లో ఎవరు నచ్చకపోతే.. ఓటర్లు నోటాకు ఓటు వేసే  సదుపాయం ఉంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చిన చట్టపరంగా ఎలాంటి పరిణామాలు లేవు. ఈ సందర్భంలో నోటా తర్వాత ఎవరికీ ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లనే విజేతలుగా ప్రకటిస్తారు. తాజాగా ఎన్నికల్లో నోటాకు ఒకవేళ ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ప్రముఖ రచయత శివ్ ఖేరా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం  దాఖలు చేసారు. మరోవైపు నోటా కంటే తక్కువ ఓట్లు పోలైన వ్యక్తి మరో ఐదేళ్ల వరకు ఎన్నికల బరిలో నిలవకుండా ఆదేశించాలని పిటిషన్ కోరారు.

ఈ పిటిషన్‌పై ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబి పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరుపున సీనియర్ లాయర్ గోపాల్ శంకర్ నారాయణ తన వాదనలు వినిపించారు. రీసెంట్‌గా సూరత్‌లో బీజేపీ అభ్యర్ధి పోటీ లేకుండా గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది సరైన పద్దతి కాదన్నారు. పోటీలో ఒకే అభ్యర్ధి ఉన్న పోటీ నిర్వహించాలని కోరారు.

బీజేపీ లేదా కాంగ్రెస్ సహా తమ నాయకుడిని ఎన్నుకోవడం ఇష్టం లేని ఓటర్లు.. రాజ్యాంగం ప్రకారం తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా.. నోటాకు ఓటు వేసేవారేమో అని పేర్కొన్నారు. ఇది ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశం కాబట్టి.. వారు వాదనలు వినాల్సి ఉందని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.  

Also Read: Hyderabad Weather Report: హైదరాబాద్‌ నగరంలో భానుడి ఉగ్రరూపం.. ఈ ఆరు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఎండలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News