NEET UG 2024 Registration : నీట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు ఫీజు, అప్లై చేసుకునే విధానం..

NEET UG 2024 Registration : నీట్ యూజీ 2024 రిజిస్ట్రేషన్స్ మొదలయ్యాయి.  అధికారిక వెబ్‌సైట్ neet.ntaonline.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఎన్టీఏ ఈ పరీక్ష నిర్వహిస్తోంది.

Written by - Renuka Godugu | Last Updated : Feb 10, 2024, 11:35 AM IST
NEET UG 2024 Registration : నీట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు ఫీజు, అప్లై చేసుకునే విధానం..

NEET UG 2024 Registration : నీట్ యూజీ 2024 రిజిస్ట్రేషన్స్ మొదలయ్యాయి.  అధికారిక వెబ్‌సైట్ neet.ntaonline.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఎన్టీఏ ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ప్రవేశ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు తెలుసుకుందాం.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2024 ఫిబ్రవరి 9 నుంచి నీట్ ఎగ్జామ్ దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది.  నీట్ ఎగ్జామ్ రాయనున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో కావాల్సిన ధృవపత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 17 సంవత్సరాలు నిండిన, నిర్దేశిత విద్యార్హత ఉన్న అన్ని వయస్సుల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

ఇదీ చదవండి: Agniveer Recruitment 2024: ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2024 ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి..

నీట్ ముఖ్యమైన తేదీలు..
2024 ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9 వరకు దరఖాస్తుల స్వీకరణ జరగనుంది.

దరఖాస్తు రుసుము..
జనరల్/ఎన్ఆర్ఐ రూ.1700
జనరల్-EWS/OBC-NCL- రూ.1600
SC/ST/PwBD/Third Gender - రూ. 1000
దరఖాస్తు చేసుకునేందుకు https://neet.nta.nic.in/ క్లిక్ చేయండి.

పరీక్ష తేదీ..
2024 మే 5న ఆదివారం జరగనుంది. పరీక్ష సమయం 200 నిమిషాలు (3hrs. 20 minutes)
సమయం: 2PM to 5:20PM

ఇదీ చదవండి: ISRO Recruitment 2024: పది పాసైనవారికి బంపర్ ఆఫర్.. ఇస్రోలో జాబ్స్.. రూ.80,000 జీతం..

పరీక్ష కేంద్రాలను అడ్మిట్ కార్డ్ పై సూచిస్తారు. ఇక ఈ పరీక్ష ఫలితాలను జూన్ 14 న అధికారిక వెబ్‌సైట్లో ఉంచనున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతోపాటు మొత్తం 13 భాషల్లో ఆఫ్‌లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.  (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News