Lakshadweep vaccination: లక్షద్వీప్ మరో ఘనత.. 15-18 ఏళ్ల పిల్లలకు 100 శాతం వ్యాక్సినేషన్..

Lakshadweep: దేశంలో కరోనా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియ జోరందుకుంది. ఈ క్రమంలో కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ మరో ఘనతను సాధించింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2022, 11:41 AM IST
Lakshadweep vaccination: లక్షద్వీప్ మరో ఘనత.. 15-18 ఏళ్ల పిల్లలకు 100 శాతం వ్యాక్సినేషన్..

Lakshadweep achieves 100% COVID-19 vaccination: కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ (Lakshadweep) మరో ఘనతను సాధించింది. దేశంలో 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు 100 శాతం కొవిడ్-19 వ్యాక్సినేషన్‌ (COVID-19 vaccination) అందించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. దేశవ్యాప్తంగా 15 నుంచి 18 వయస్సు గల పిల్లలకు టీకా కార్యక్రమాన్ని జనవరి 3, 2022న ప్రారంభించారు. ఈ మేరకు లక్షద్వీప్ జిల్లా కలెక్టర్, కార్యదర్శి ఎస్ అస్కర్ అలీ మాట్లాడుతూ.. దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా కవరత్తిలో చిన్నారులకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ (Praful Patel ) ప్రారంభించారని తెలిపారు. 

లక్షద్వీప్‌లోని పది జనావాసాలున్న దీవుల్లోని పాఠశాలల్లో నిర్వహించిన వివిధ అవగాహన కార్యక్రమాల ద్వారా టీకా డ్రైవ్ ప్రారంభించిన వారం లోపే 3,492 మంది పిల్లలకు వ్యాక్సిన్ లక్ష్యాన్ని సాధించడం విశేషమని ఆయన పేర్కొన్నారు. హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారందరికీ 100 శాతం టీకాలు వేసిన కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలలో లక్షద్వీప్ మొదటిది. 

Also Read: Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతిని ఆపలేమంటున్న వైద్య నిపుణులు

లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ జనవరి 10, 2022 నుంచి ఫ్రంట్‌లైన్ కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడిన పౌరులకు బూస్టర్ డోస్‌లను అందించడం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. నైట్ కర్ఫ్యూ (night curfew) విధించడం, తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం, వ్యాక్సినేషన్, టెస్టింగ్, ట్రాకింగ్ వంటి కరోనా నిర్వహణ చర్యల ద్వారా థర్డ్ వేవ్ (Third Wave in india) కోసం సిద్ధమవుతున్నట్లు కేంద్రపాలిత ప్రాంతం వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 153.70 కోట్ల డోసులు అందించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News