1.16 లక్షల ఐటీ నోటీసులు జారీ

గత ఏడాది పెద్ద నోట్ల రద్దు తరువాత బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బు దాచుకున్నవారిపై ఐటీ శాఖ కొరఢా ఝుళిపించింది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో డబ్బు జమచేసిన వ్యక్తులు, సంస్థలకు మంగళవారం నోటీసులు జారీ చేసింది.

Last Updated : Nov 28, 2017, 04:51 PM IST
1.16 లక్షల ఐటీ నోటీసులు జారీ

గత ఏడాది పెద్ద నోట్ల రద్దు తరువాత బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బు దాచుకున్నవారిపై ఐటీ శాఖ కొరఢా ఝుళిపించింది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో డబ్బు జమచేసిన వ్యక్తులు, సంస్థలకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. బ్యాంకుల్లో 25 లక్షలు, ఆపై డబ్బు జమ చేసిన వారికి తొలివిడతగా నోటీసులు జారీచేశారు. ఆతరువాత రూ.10 లక్షల, ఆపై డబ్బు జమచేసిన వారికి నోటీసులు జారీచేయనున్నారు. 

పెద్ద నోట్ల రద్దు తరువాత బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బు జమచేసి ఐటీ రిటర్న్ దాఖలు చేయని వ్యక్తుల, సంస్థలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. ఐటీ రిటర్నులు దాఖలు చేయని వివరాలను రూ.10 లక్షలు-25 లక్షలు జమచేసినవారు, రూ. 25 లక్షలు, ఆపైన జమచేసిన వారు అని రెండు భాగాలుగా విభజించారు ఐటీ శాఖ.  అందులో భాగంగా మొదట రూ.25 లక్షలు, ఆపైన డబ్బులు జమచేసిన వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీచేశారు.

Trending News