Arvind Kejriwal: కర్మ ఎవరిని వదిలిపెట్టదు.. కేజ్రీవాల్ అరెస్టుపై ప్రణబ్ కుమార్తె ఘాటు వ్యాఖ్యలు..

Sharmistha Mukherjee Reaction: బీజేపీ అప్రజాస్వామిక మార్గాల ద్వారా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్తె షర్మిష్ట వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు అనేవి విలువలు పెంచేలా ఉండాలి కానీ, దిగజారేలా ఉండకూడదంటూ కామెంట్లు చేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 22, 2024, 05:18 PM IST
  • ఢిల్లీ సీఎం అరెస్టుపై ప్రణమ్ కుమార్తె సంచలన వ్యాఖ్యలు..
  • షీలా దీక్షిత్ పై అసత్య ఆరోపణలు చేశారంటూ మండిపాటు..
Arvind Kejriwal: కర్మ ఎవరిని వదిలిపెట్టదు.. కేజ్రీవాల్ అరెస్టుపై ప్రణబ్ కుమార్తె ఘాటు వ్యాఖ్యలు..

Pranab Mukherjees Daughter Sharmistha Mukherjee On CM Kejriwal Arrest: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అవ్వడం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఇప్పటికే  ఇదే లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ అరెస్టు చేసి, విచారణ చేస్టున్న విషయం తెలిసిందే.ఇక లిక్కర్ కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటు ఒకవైపు దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో ఆయా పార్టీలు ప్రచారంలో బిజీగా మారిపోయాయి. మరోక వైపు.. ఈడీకూడా లిక్కర్ కేసులో దూకుడు పెంచింది. దీనిపై అపోసిషన్ లీడర్లు ఘాటుగా స్పందిస్తున్నారు. మోదీ ఈడీ, దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి అపోసిషన్ రాజకీయనేతలపై ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. ఈడీని అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ.. పెద్ద ఎత్తున ఆప్ కార్యకర్తలు, రోడ్డుమీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు.

Read More: Delhi Liquor Case: లిక్కర్ కేసులో కవితకు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు..

ఇదిలా ఉండగా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ కొందరు బీజేపీని, ఈడీని ఎండగడుతుండగా.. ఇదే క్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్తె శర్మిష్ట చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేకెత్తిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ ఢిల్లీకి సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమెపై అప్పటి ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, అన్నాహాజారేలు అనేక తప్పుడు ఆరోపణలు చేశారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట  పేర్కొన్నారు. పూర్తిగా బాధ్యతారహితమైన, నిరాధారమైన ఆరోపణలు చేశారని సీఎం కేజ్రీవాల్ పై మండిపడ్డారు.

షీలా దీక్షిత్ కు వ్యతిరేకంగా ట్రంక్ ల కొద్ది సాక్ష్యాలు కేజ్రీవాల్ అన్నారని, కానీ సాక్ష్యాలను ప్రజల ముందు ఉంచడంలో మాత్రం విఫలమయ్యారని శర్మిష్ట తీవ్రంగా స్పందించారు.కర్మ ఎవరిని వదిలిపెట్టదని, ఒకరిపై మనం అనవసరంగా నిందలు వేస్తే.. అది తిరిగి వస్తుందని, ప్రస్తుతం కేజ్రీవాల్ కూడా ఈడీ నుంచి అప్పటి చర్యలకు పర్యావసానం అనుభవిస్తున్నారంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. శర్మిష్ట ముఖర్జీ మాట్లాడుతూ... ఇటీవల కాంగ్రెస్ పార్టీ,  దాని నాయకత్వంపై తాను చేసిన విమర్శల కోసం "సోషల్ మీడియాలో కాంగ్రెస్ మద్దతుదారులు ఆరోపిస్తూ దుర్మార్గంగా తనను ట్రోల్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకంలో రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి. రాహుల్ రాజకీయంగా ఇంకా పరిణతి చెందాలని, సభలో అంత సీరియస్ గా ఉన్నట్లు కన్పించడంలేదని, తరచుగా సభలో గైర్హాజరు కావడం పట్ల ప్రణమ్ తన భావాన్ని తెలిపారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ గురించి ప్రశంసలు కూడా కురిపించారు. రాహుల్ పై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించి,కొందరు కావాలనే తనను కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు పాల్పడ్డారని కూడా శర్మిష్ట పేర్కొన్నారు.

Read More: Venomous Snake: లోదుస్తులు పెట్టే ర్యాక్ లో ప్రపంచంలోనే రెండో అత్యంత విషసర్పం.. ఆ తర్వాత ఏంజరిగిందో తెలుసా..?

కొన్ని రోజుల క్రితం, జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ సందర్భంగా శర్మిష్ట మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌వాదినని, జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు ఇంకా చాలా ప్రాముఖ్యత ఉందని అన్నారు. అయితే కాంగ్రెస్ గాంధీ-నెహ్రూ కుటుంబ నాయకత్వానికి అతీతంగా చూడాలని ఆమె స్పష్టం చేసింది. కానీ ప్రస్తుతం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై చేసిన వ్యాఖ్యలు మాత్రం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారాయి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News