Delhi Liquor Scam: నీ గురించి నువ్వేమనుకుంటున్నావ్... కేజ్రీవాల్ బెయిల్ పిటిషనర్ పై హైకోర్టు సీరియస్..

Delhi Liquor Scam:లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో.. ఆయనకు మధ్యంత బెయిల్ ఇవ్వాలని కోరుతూ న్యాయవిద్యార్థి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషనర్ పై ఆగ్రహాం వ్యక్తం చేసింది.   

Written by - Inamdar Paresh | Last Updated : Apr 22, 2024, 03:12 PM IST
  • లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్..
  • పిటిషన్ కు రూ.75,000 జరిమానా వేసిన హైకోర్టు..
Delhi Liquor Scam: నీ గురించి నువ్వేమనుకుంటున్నావ్... కేజ్రీవాల్ బెయిల్ పిటిషనర్ పై హైకోర్టు సీరియస్..

Delhi High Court Serious On Law Student Seeks Bail: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశంలో తీవ్రసంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అయి తీహార్ జైలులోనే ఉన్నారు. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇదే కేసులో అక్కడే రిమాండ్ లో ఉన్నారు. ఈక్రమంలో ఇటీవల తీహార్ జైలులో అధికారులు ఆయనకు ఇన్సులీన్ ఇవ్వడంలేదని ఆయన తరపు లాయర్లు కోర్టులో వాదించారు. ఆయన సతీమణికూడా తన భర్త ఎన్నో ఏళ్లుగా ప్రతిరోజు షుగర్ కు ఇన్సులీన్ తీసుకుంటారని తెలిపారు. కానీ జైలులో కావాలని తన భర్తకు ఇన్సులీన్ ఇవ్వట్లేదంటూ ఆరోపణలు చేశారు. తన భర్త ప్రాణాలకు ప్రమాదంకల్పించాలని కొంత మంది చూస్తున్నారంటూ, కేజ్రీవాల్ సతీమణీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. మరోవైపు ఈడీ వాదన దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. జైలులో షుగర్ లెవర్స్ పెంచుకుని, హెల్త్ కారణాలతో బెయిల్ పొందాలని చూస్తున్నట్లు ఈడీ ఆరోపించింది. అంతేకాకుండా.. కేజ్రీవాల్ కావాలని స్వీట్లు, మామిడిపండ్లు అతిగా తింటున్నారంటూ ఆరోపించింది. ఈ క్రమంలో ఆప్ నేతలు, మంత్రులు కూడా తీహార్ జైలుబైట తమ నిరసలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టులో న్యాయవిద్యను అభ్యసిస్తున్న ఒక విద్యార్థి వేసిన పిటిషన్ చర్చనీయాంశంగా మారింది.

Read More: Breakups Leaves: ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్.. బ్రేకప్ అయిన వాళ్లకు అన్ లిమిటెడ్ లీవ్స్..

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితులను అర్ధం చేసుకుని, జైలులో ఉన్న ఆయనకు మధ్యంత బెయిర్ మంజురు చేయాలని  ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, పిటిషనర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా.. మధ్యంతర బెయిల్‌ను కోరిన పిటిషనర్‌కు హైకోర్టు రూ.75,000 జరిమానా కూడా విధించింది. ఎక్సైజ్ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు "అసాధారణమైన మధ్యంతర బెయిల్" ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. న్యాయ విద్యార్థి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ కోసం ప్రయత్నించాడు. కేజ్రీవాల్ బెయిల్ కోసం..  న్యాయవాది , న్యాయ విద్యార్థి పిటిషన్‌ను 'పబ్లిసిటీ లిటిగేషన్'గా ముద్రించారు. 

ఇదిలా ఉండగా.. తనను తాను 'వి ది పీపుల్ ఆఫ్ ఇండియా'గా పేర్కొన్న నాల్గవ సంవత్సరం న్యాయ విద్యార్థి దాఖలు చేసిన PIL, ఇప్పుడు రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసుతో సహా, కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని కోరింది. అయితే, కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి స్వయంగా వ్యతిరేకించారు, దీనిని "ఆకస్మిక దాడి" అని అభివర్ణించారు. కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఈ పిటిషన్‌ను "పబ్లిసిటీ లిటిగేషన్", "రాజకీయ ప్రేరేపితమైనదిగా అభివర్ణించారు.

Read More: Snakes Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒకేసారి రెండు నాగుపాముల్ని నోటితో పట్టుకున్న కింగ్ కోబ్రా..

ఇది పూర్తిగా పబ్లిసిటీ కోసం చేసిందని, పిటిషన్ దాఖలు చేయడానికి పిటిషనర్ ఎవరు? అని కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా అన్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాతో సహా, రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది. పిటిషనర్‌పై రూ. 70,000 ఖర్చు కూడా విధించింది. న్యాయ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు నీకు నువ్వు అసలు ఏమనుకుంటున్నావ్ అంటూ హైకోర్టు ధర్మాసనం సీరియస్ గా స్పందించింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News