హనీమూన్ ట్రిప్ కోసం రైలు మొత్తాన్ని బుక్ చేసుకున్నారు

హిల్ టూరిజంను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా, నీలగిరి పర్వత రైల్వే విభాగంలో 120 సీటింగ్ సామర్ధ్యం కలిగిన ప్రత్యేక రైలును నడిపేందుకు సేలం డివిజన్‌కు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నలిచ్చింది.

Last Updated : Sep 2, 2018, 02:07 PM IST
హనీమూన్ ట్రిప్ కోసం రైలు మొత్తాన్ని బుక్ చేసుకున్నారు

కోయంబత్తూర్: ఇటీవలే పెళ్లి చేసుకున్న గ్రాహం విలియం (30), సిల్వియా ప్లాసిక్(27) అనే బ్రిటిష్ దంపతులు తమ హనీమూన్ హనీమూన్ ట్రిప్ కోసం ఏకంగా రైలు మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. మెట్టుపాలయం నుండి ఉధగమండలం (ఊటీ)వరకు నడిచే ఈ రైలు నీలగిరి కొండల్లో ప్రయాణిస్తుంది. 120 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ రైలును.. రూ.మూడు లక్షలు చెల్లించి రైల్వే వెబ్‌సైట్ ఐఆర్‌సీటీసీ ద్వారా దీన్ని బుక్ చేసుకున్నారు. ఇలా దేశంలో రైలు మొత్తాన్ని బుక్ చేసుకున్న మొదటి దంపతులుగా వీరు నిలిచారు.

హిల్ టూరిజంను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా, నీలగిరి పర్వత రైల్వే విభాగంలో 120 సీటింగ్ సామర్ధ్యం కలిగిన ప్రత్యేక రైలును నడిపేందుకు సేలం డివిజన్‌కు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నలిచ్చింది. ఈ రైలు ఉదయం 9.10 గంటలకు మెట్టుపాలయంలో బయల్దేరి మధ్యాహ్నం 2.40 గంటలకు ఊటీ చేరుకుంది. పచ్చని ప్రకృతి నెలవైన నీలగిరి అందాలను ఆస్వాదిస్తూ.. 13 సొరంగాల గుండా ప్రయాణించి తమ జీవితంలో మరపురాని సంతోషాల్ని సొంతం చేసుకున్నారు ఈ దంపతులిద్దరూ.

1997లో ప్రసిద్ద నీలగిరి పర్వతాల పర్యటన కోసం దక్షిణ రైల్వే ‘నీలగిరి మౌంటేన్‌ రైల్వే’పేరిట చార్టర్డ్‌ రైల్వే సర్వీసులను ప్రారంభించింది. అయితే, ఈ సర్వీసులు 2004లో ఆగిపోయాయి. అధునాతన కోచ్‌లు, లోకోమోటివ్స్‌ను అందుబాటులోకి తెచ్చి రైల్వే శాఖ నీలగిరి మౌంటేన్‌ సర్వీసులను శుక్రవారం మళ్లీ పునఃప్రారంభించింది.

Trending News