NEET 2024 Crime: తమ్ముడి కోసం అన్న త్యాగం.. కానీ చివరికి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికి జైలుపాలు

Brother Appears Younger Brother NEET Exam In Rajasthan: తమ్ముడు కోసం చేసిన పని అన్నను జైలుపాలు చేసింది. మంచి చేద్దామని వక్రమార్గంలో ప్రయత్నించడంతో అన్న రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 7, 2024, 02:39 PM IST
NEET 2024 Crime: తమ్ముడి కోసం అన్న త్యాగం.. కానీ చివరికి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికి జైలుపాలు

NEET 2024: ఎన్నిసార్లు రాసినా పరీక్ష తప్పుతున్న తమ్ముడిని గట్టెక్కించాలని.. వైద్యుడిగా చేయాలని భావించిన అన్న తప్పటడుగు వేశాడు. పాస్‌ చేయించేందుకు తమ్ముడి పరీక్షకు అన్న హాజరయ్యాడు. తమ్ముడి బదులు అన్న పరీక్ష రాసేందుకు హాల్‌కు చేరుకోగా.. తనిఖీల సమయంలో పోలీసులకు చిక్కాడు. హాల్‌ టికెట్‌, ఇతర వివరాలు పరిశీలించగా వేరే అభ్యర్థి అని గ్రహించి నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి అన్నతోపాటు అతడి తమ్ముడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.

Also Read: Starliner: కీలక అంతరిక్ష ప్రయోగం నిలిపివేత.. సునీతా విలియమ్స్‌ రికార్డుకు బ్రేక్‌

వైద్య ప్రవేశ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నీట్‌ పరీక్ష జరిగింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో కూడా ఈ పరీక్ష నిర్వహించారు. ఆ పట్టణంలోని అంత్రిదేవి ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష కేంద్రం పడింది. ఈ పరీక్ష రాసేందుకు భగీరథ్‌ రామ్‌ వచ్చాడు. పరీక్ష కేంద్రంలోకి వెళ్తుండగా అధికారులు తనిఖీలు చేయగా.. హాల్‌ టికెట్‌, ఇతర ధ్రువపత్రాలు వేరుగా ఉన్నాయి. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నారని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వివరాలు ఆరా తీయగా.. తన తమ్ముడు గోపాల్‌ రామ్‌కు బదులు తాను పరీక్ష రాస్తున్నట్లు వివరించాడు. తమ్ముడు గోపాల్‌ నీట్‌ పరీక్షను ఉత్తీర్ణత సాధించకపోవడంతో అన్న భగీరథ్‌ సాహసం చేశాడు.

Also Read: NEET 2024 Paper Leak: నీట్ 2024 పేపర్ లీక్ అయిందా, ఆ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష

 

తమ్ముడి నీట్‌ పరీక్షను రాసి ఉత్తీర్ణత సాధించేలా ఈ పరీక్షను తాను హాజరైనట్లు భగీరథ్‌ రామ్‌ తెలిపాడు. కాగా, భగీరథ్‌ రామ్‌ కూడా గతేడాది నీట్‌ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాడు. ప్రస్తుతం జోధ్‌పూర్‌లోని వైద్య కళాశాలలో భగీరథ్‌ రామ్‌ ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. అనేక ప్రయత్నాల తర్వాత తాను నీట్‌ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించినట్లు పోలీసులకు వివరించాడు. తనలాగా తన తమ్ముడు కష్టపడకూడదనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు భగీరథ్‌ వివరణ ఇచ్చాడు. ఏది చేసినా ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడం చట్టరీత్యా నేరం. దీంతో అన్నాదమ్ముళ్లు భగీరథ్‌ రామ్‌, గోపాల్‌ రామ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారిద్దరితోపాటు ప్రోత్సహించిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేయడం గమనార్హం.

కాగా దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. వైద్య ప్రవేశ పరీక్షల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. కాగా రాజస్థాన్‌లోని కోటాలో ఈ పరీక్షపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవల చాలా మంది విద్యార్థులు ఆందోళనతో ఆత్మహత్య చేసుకుంటున్న విషయం తెలిసిందే. నీట్‌ ప్రశ్నాపత్రం పరిశీలించి.. ఫలితాల తర్వాత మరింత భయాందోళనకర పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా అక్కడి స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News