Weather Forecast: తరలిపోతున్న రుతుపవనాలు, ఇక వర్షాలు లేనట్టే

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్ని గత కొద్దిరోజులుగా వెంటాడుతున్న తీవ్రమైన ఉక్కపోత, వేడి మరి కొన్నిరోజులు తప్పేట్లు లేదు. రుతు పవనాలు వెళ్లిపోతుండటంతో ఇక వర్షాలు లేనట్టేనని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 7, 2023, 07:30 AM IST
Weather Forecast: తరలిపోతున్న రుతుపవనాలు, ఇక వర్షాలు లేనట్టే

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై ఐఎండీ తాజా అప్‌డేట్ వెలువరించింది. నైరుతి రుతుపవనాలు తరలిపోనున్నాయని, ఫలితంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడా వర్షాలు పడే సూచనలు లేవని ఐఎండీ సూచించింది. అంటే తీవ్రమైన ఉక్కపోత, వేడి మరి కొద్దిరోజులు తప్పేట్లు లేదు. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొద్దిరోజుల్నించి తీవ్రమైన ఉక్కపోత, వేడి ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటోంది. అక్కడక్కడా ఆకాశం మేఘావృతమై కన్పించినా వర్షాల జాడ మాత్రం లేదు. దీనికి కారణం నైరుతి రుతుపవనాలు వెనక్కి తరలిపోతుండటమేనని వాతావరణ శాఖ వెల్లడించింది. గాలు వేగం కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల మేఘాల కదలిక పెద్దగా ఉండదు. ఇక వర్షాలు దాదాపుగా ముగిసిపోయినట్టే. 

తుపాను ప్రభావం ఎక్కడైనా ఉంటే తప్ప ఇక తెలుగు రాష్ట్రాలకు వర్షాలు లేనట్టేనని తెలుస్తోంది. ఈ నెల 8,9 తేదీల్లో పుదుచ్చేరి, గోవా ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కడా కన్పించడం లేదు. అక్కడక్కడా మేఘాలు కన్పించినా వర్షాలు పడే పరిస్థితులు లేవు. తూర్పు ఆసియా ప్రాంతంలో ఏర్పడిన కొయిను తుపాను బలపడి వియత్నాం వద్ద తీరం దాటనుందని తెలుస్తోంది. ఈ  తుపాను ప్రభావంతో తిరిగి మేఘాలు ఏర్పడవచ్చు.

ఏపీలో పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 36 డిగ్రీలు, తెలంగాణలో గరిష్టంగా 32 డిగ్రీలు ఉంటోంది. ఇవాళ, రేపు ఏపీలోని కోస్తా ప్రాంతాల్లో ఎండలు గట్టిగా ఉండవచ్చు. ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఉదయం వేళ మంచు పెరుగుతూ శీతాకాలం సంకేతాలు కన్పిస్తున్నాయి. 

అంటే తెలుగు రాష్ట్రాల్లో మరి కొద్దిరోజులు అంటే అక్టోబర్ నెలంతా వర్షాలుండకపోవచ్చు. అదే సమయంలో తీవ్ర ఉక్కపోత, వేడి ప్రజానీకాన్ని బాధించనుంది. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాన్లు వచ్చే అవకాశమున్నందున ఆ ప్రభావంతో వర్షాలు పడే అవకాశాలుండవచ్చు తప్ప ఇతర పరిస్థితులతో మాత్రం వర్షాలు లేనట్టేనని తెలుస్తోంది. 

Also read: Five state Elections: తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికలకు మరో రెండ్రోజుల్లో నోటిఫికేషన్, ఎన్నికలెప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News