Hindenburg vs Adani: సర్వత్రా ఉత్కంఠ.. అదానీ వ్యవహారంపై నేడు సుప్రీంలో విచారణ

Supreme Court On Hindenburg Report: అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్ బయటపెట్టిన సంచలన నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక బయటకు వచ్చిన తరువాత అదానీ షేర్లు భారీగా పతనమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ గ్రూప్‌పై దాఖలు అయిన రెండు పిటిషన్లను నేడు విచారించనుంది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2023, 01:03 PM IST
Hindenburg vs Adani: సర్వత్రా ఉత్కంఠ.. అదానీ వ్యవహారంపై నేడు సుప్రీంలో విచారణ

Supreme Court On Hindenburg Report: అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకారం కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయన్న కేసులో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ పిటిషన్‌ గత గురువారం జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు దాఖలైంది. ఈ కేసులో విశాల్ తివారీ అనే న్యాయవాది దాఖలు చేసిన రెండో పిటిషన్ ఇది. అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ నివేదికపై దర్యాప్తునకు కమిటీని వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరిపించాలని పేర్కొన్నారు. ఇప్పటికే దాఖలైన పిటిషన్‌తో పాటు ఈ రెండో పిటిషన్‌ను కూడా విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జేబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం ముందు ఈ అంశంపై ప్రత్యేక పిటిషన్ కూడా దాఖలు అయిందని పిటిషనర్ విశాల్ తివారీ ధర్మాసనానికి తెలిపారు. వీరి విచారణ నేడు (ఫిబ్రవరి 10న) జరగనుంది. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బడా కార్పొరేట్ సంస్థలకు రూ.500 కోట్లకు పైగా రుణాలు ఇచ్చిన విధానంపై దర్యాప్తునకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని తివారీ తన పిటిషన్‌లో కోరారు. అత్యవసరంగా దీనిపై విచారణ చేపట్టాలని కోర్టుకు విన్నవించారు. తన పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలను ఆయన ప్రతివాదులుగా చేర్చారు.

గత వారం హిండెన్‌బర్గ్ నివేదికను ఉద్దేశపూర్వకంగా తయారుచేసిందని న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ షేర్లను కృత్రిమంగా తగ్గించేందుకు హిండెన్‌బర్గ్ కుట్ర పన్నిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నివేదికను తెరపైకి తెచ్చి అమాయక పెట్టుబడిదారులను దోపిడీ చేయడమే వీరి ఉద్దేశమన్నారు. ఈ పిటిషన్‌పై కూడా శుక్రవారం కూడా విచారణ జరగనుంది.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. అయితే మళ్లీ రీసెంట్‌గా అదానీ గ్రూప్ షేర్లు మళ్లీ ఊపందుకుంటున్నాయి. హిండెన్‌బర్గ్ నివేదికను అదానీ గ్రూప్ కూడా ఖండించింది. ఇది తమ సంస్థపై జరుగుతున్న కుట్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Also Read: North Korea Military Parade: ఉత్తర కొరియాలో భారీ పరేడ్.. తొలిసారి అతిపెద్ద క్షిపణులు ప్రదర్శన  

Also Read: CM Jagan Mohan Reddy: ఏపీలో వారికి గుడ్‌న్యూస్.. నేడే అకౌంట్‌లోకి డబ్బులు జమ.. ఒక్కొక్కరికి రూ.లక్ష  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News