7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్.. జీతాలకు భారీగా కేటాయింపులు

7th Pay Commission Latest Updates: ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులకు భారీగా కేటాయింపులు చేపట్టింది కర్ణాటక సర్కారు. గతేడాది కంటే రూ.15,431 కోట్లు పెంచింది. ఏప్రిల్ నుంచి కొత్త పే స్కేలు అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలోనే అధికంగా కేటాయించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2024, 12:31 PM IST
7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్.. జీతాలకు భారీగా కేటాయింపులు

7th Pay Commission Latest Updates: రాబోయే ఆర్థిక సంవత్సరానికి  కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్ కేటాయింపులో 24 శాతం అంటే రూ.15,431 కోట్లు పెరిగాయి. ప్రభుత్వ సిబ్బందికి ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు ముందుచూపుతో అదనపు కేటాయింపులు చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఏప్రిల్ 2023లో 17 శాతం అధికంగా కేటాయించింది. 2023-24 వేతన వ్యయం సవరించిన అంచనాలు రూ.65,003 కోట్లు కాగా.. 2024-25కి సంబంధించిన బడ్జెట్ అంచనా రూ.80,434 కోట్లకు పెరిగింది. పే ప్యానెల్ నివేదికను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. తమ ప్రాథమిక లెక్కల ప్రకారం.. ఏడవ పే స్కేల్ అమలుకు దాదాపు రూ.15 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. ఏప్రిల్ నుంచి అమలు చేయాలని పే స్కేలు అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: Pallavi Prashanth: 'బిగ్‌బాస్‌' పల్లవి ప్రశాంత్‌ కేసులో కీలక మలుపు.. ఈసారి ఏం జరిగిందంటే..?

కమిషన్ సిఫార్సులు సమర్పించిన తర్వాత విధివిధానాలు రూపొందిస్తామని అదనపు చీఫ్ సెక్రటరీ (ఆర్థిక) ఎల్‌కే అతీక్ తెలిపారు. మధ్య-కాల ఆర్థిక విధానం (MTFP) 2024-2028 ప్రకారం.. సవరించిన పేస్కేల్ అమలు రాబోయే సంవత్సరాల్లో భారీ పెరుగుదలకు దారితీయవచ్చన్నారు. రాబోయే సంవత్సరాల్లో ద్రవ్య లోటు లక్ష్యాలను కొనసాగించడంలో తీవ్ర సవాలుగా మారవచ్చని పేర్కొన్నారు. ఏడవ పే స్కేల్‌ వచ్చిన మొదటి సంవత్సరానికి రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఉంటాయన్నారు. 

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షడక్షరి సీఎస్‌ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే ఈ పెంపుదల అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 27వ తేదీన ప్యాలెస్‌ గ్రౌండ్స్‌లో భారీ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం పాత పెన్షన్ స్కీమ్ (OPS)కి తిరిగి రావాలని కూడా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఓపీఎస్ అమలు చేసేందుకు సమయం కావాలంటే.. కొత్త పెన్షన్ స్కీమ్ కోసం తమ జీతాల నుంచి 10 శాతం తగ్గింపును నిలిపివేయాలన్నారు. 

అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలుకు రాష్ట్రం ప్రభుత్వం మొగ్గు చూపితే.. ఎన్‌పీఎస్‌ కంటే 4, 5 రెట్లు ఎక్కువగా అదనపు భారం ఉంటుందని ఆర్‌బీఐ హెచ్చరించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెను భారం అవుతుందని పేర్కొంది. దీర్ఘకాలికంగా సంక్షేమం, అభివృద్ధి వ్యయాలను తగ్గించడానికి దారి తీస్తుందని MTFP తెలిపింది. 2027-28 నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కర్ణాటక సర్కారుకు దాదాపు రూ.లక్ష కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన రూ. 80,434 కోట్ల నుంచి జీతంపై వ్యయం క్రమంగా పెరుగుతుందని, 2027-28 నాటికి రూ.98,535 కోట్లకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు.

Also Read: Oneplus 12 Vs Oneplus 12R: ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్స్‌, ధర పరంగా ఇదే బెస్ట్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News