7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని బహుమతి.. మరో అదిరిపోయే ప్రకటన..!

7th Pay Commission HRA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకేసారి డబుల్ గిఫ్ట్ వచ్చింది. జీతాల పెంపుతో హెచ్‌ఆర్‌ఏ కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. X, Y, Z కేటగిరీ నగరాలను బట్టి హెచ్‌ఆర్ఏ పెంపు ప్రకటన చేసింది. ఏ నగరాల్లో ఎంత పెరిగిందంటే..?  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 8, 2024, 07:01 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని బహుమతి.. మరో అదిరిపోయే ప్రకటన..!

7th Pay Commission HRA Hike News: కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏ, డీఆర్‌ను 4 శాతం పెంచుతు నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం డీఏ 46 శాతం నుంచి 50 శాతానికి చేరింది. హోలీకి ముందు డీఏ, డీఆర్‌ పెంచడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన జీతాలు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఉద్యోగులకు జీతాలతోపాటు ఇంటి అద్దె అలవెన్స్‌ పెరగనుంది. హెచ్‌ఆర్ఏ పెంపుతో ప్రభుత్వంపై రూ.9 వేల కోట్ల అదనపు భారం పడనుంది.

Also Read: Employment News: కేవలం రూ.25 చెల్లిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం

X కేటగిరీ నగరాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం హెచ్‌ఆర్‌ఏ పెరిగింది. దీంతో 27 శాతం నుంచి 30 శాతం హెచ్ఆర్‌ఏ అందుకోనున్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే, చెన్నై, కోల్‌కతా తదితర నగరాల్లో నివసిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 30 శాతం హెచ్‌ఆర్ఏ పొందనున్నారు. Y కేటగిరీ నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏను 2 శాతం పెంచింది. ప్రస్తుతం ఇది 18 శాతం ఉండగా.. 2 శాతం పెంపుతో 20 శాతానికి చేరింది. 

Y కేటగిరీ కింద ఫరీదాబాద్, ఘజియాబాద్, గుర్గావ్, నోయిడా, రాంచీ, జమ్ము, శ్రీనగర్, గ్వాలియర్, ఇండోర్, భోపాల్, జబల్‌పూర్, ఉజ్జయిని, కొల్హాపూర్, ఔరంగాబాద్, నాగ్‌పూర్, సాంగ్లీ, షోలాపూర్, నాసిక్, నాందేడ్, పాట్నా, లక్నో, విశాఖపట్నం , విజయవాడ, గౌహతి, చండీగఢ్, రాయ్‌పూర్, రాజ్‌కోట్, జామ్‌నగర్, వడోదర, సూరత్, అమరావతి, కటక్, భువనేశ్వర్, రూర్కెలా, అమృత్‌సర్, జలంధర్, లూథియానా, మొరాదాబాద్, మీరట్, బరేలీ, అలీగఢ్, ఆగ్రా, లక్నో, కాన్పూర్, అలహాబాద్, ఎఫ్ఐర్ కాన్పూర్ , ఝాన్సీ, వారణాసి, సహరాన్‌పూర్, బికనీర్, జైపూర్, జోధ్‌పూర్, కోట, అజ్మీర్ తదితర నగరాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ఉద్యోగులు 20 శాతం హెచ్‌ఆర్ఏ పొందనున్నారు.

Z కేటగిరీ సిటీల్లో నివసిస్తున్న ఉద్యోగుల హెచ్‌ఆర్ఏ ఒక శాతం పెరిగింది. దీంతో 9 శాతం నుంచి 10 శాతానికి చేరింది. X, Y నగరాలు మినహా.. దేశంలోని అన్ని ఇతర నగరాలు Z కేటగిరీలో చేర్చారు. మార్చి నెల జీతంతో పాటు పెరిగిన జీతాలను కలిపి ఉద్యోగుల ఖాతాల్లో జమకానుంది. 

Also Read: Bhimaa movie Review:'భీమా' మూవీ రివ్యూ.. గోపీచంద్ ఈ సారైనా హిట్టు అందుకున్నట్టేనా.. ? 

Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News