Diabetes: వేగంగా మధుమేహం తగ్గడానికి ఖాళీ కడుపుతో ఈ పలుకులు తినండి చాలు, అస్సలు నమ్మరు!

Pistachio For Diabetes: పిస్తా పలుకులను ప్రతి రోజూ తినడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా మధుమేహం, రక్త పోటు, శరీర బరువు నియంత్రణ వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2023, 10:39 AM IST
Diabetes: వేగంగా మధుమేహం తగ్గడానికి ఖాళీ కడుపుతో ఈ పలుకులు తినండి చాలు, అస్సలు నమ్మరు!

Pistachio For Diabetes: డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతాయి. అందుకు వైద్య నిపుణులు..తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి వీటిని తినమని సలహాలు ఇస్తారు. అయితే వీటిని మధుమేహంతో బాధపడుతున్నవారు ఆహారాలు తిసుకునేదానికంటే ముందు తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా నియంత్రణలో ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
పిస్తాలో శరీరానికి మేలు చేసే విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో కొలెస్ట్రాల్‌ స్థాయిలు, కేలరీలు కూడా తక్కువ పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని తినడం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా రక్త పోటు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
మధుమేహంతో బాధపడుతున్నవారు పిస్తాపప్పులను క్రమం తప్పకుండా తినాలి. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్‌లో గ్లైసెమిక్ సూచిక చాలా తక్కువగా లభిస్తాయి. దీంతో మధుమేహం సులభంగా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

రోగనిరోధక శక్తి పెంచుతుంది:
పిస్తాలను క్రమం తప్పకుండా తినేవారిలో సులభంగా రోగనిరోధక శక్తి పెరగడం ప్రారంభమైందని ఇటీవల నివేదికల్లో తేలింది. ఈ డ్రై ఫ్రూట్‌లో జింక్, విటమిన్ B6 అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

శరీర బరువును నియంత్రిస్తుంది:
పిస్తాలలో ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ఉదయం పూట ఖాళీ కడుపుతో తినడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ పరిమాణాలను కూడా సులభంగా తగ్గిస్తుంది. కాబట్టి సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

రక్తహీనత సమస్యలకు చెక్‌:
పిస్తా తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలో రక్తాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి రక్తహీనత సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పిస్తా పలుకులను తినాల్సి ఉంటుంది.

జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం:
పిస్తాపప్పులో ఉండే ఫైబర్ పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అజీర్ణం, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలను తొలగిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించడానికి కూడా సహాయపడుతుంది.

Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్

Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Trending News