Lotus Health Benefits: తామర పువ్వుల్లో దాగిన ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే షాక్

Lotus: తామర పువ్వు.. పచ్చని పల్లెటూర్లలో ఎంటర్ అవ్వకముందే వెచ్చగా స్వాగతం పలుకుతూ కొలనులో వికసించి కనిపించే ఈ పువ్వులు అందరికీ ఇష్టం. అయితే వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా? అవేమిటో తెలుసుకుందాం పదండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2024, 09:21 PM IST
Lotus Health Benefits: తామర పువ్వుల్లో దాగిన ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే షాక్

Lotus Flower: పల్లెటూర్లో అడుగుపెట్టి పెట్టగానే వెల్కమ్ చెప్పే తామర పువ్వులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. పూజల్లో కూడా వీటిని మనం ఎక్కువగా వాడుతాము. ఇక తామర గింజలతో చేసిన మాలలను జపాలకి వాడుతారు. పైగా ఈ మధ్య తామర గింజలతో చేసిన స్నాక్స్ ని అల్పాహారంగా తీసుకునే పద్ధతి ఎక్కువగా చూస్తున్నాము. వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలగడంతో పాటు ఊబకాయం కూడా త్వరగా తగ్గుతుందట. కేవలం తామర గింజల్లోనే కాదు తామర పువ్వుల్లో కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే ఎన్నో రకాల సుగుణాలు దాగి ఉన్నాయి. మరి అవేమిటో తెలుసుకుందాం పదండి..

తామర పువ్వులను అనాదిగా పలు రకాల నాటువైద్యాలలో ఉపయోగించేవారు. వీటిలో పుష్కలంగా లభించి యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాల కారణంగా ఇవి చాలా అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా వాడవచ్చు. అలాగే ఈ పువ్వులలో మెగ్నీషియం, క్యాల్షియం ,ఐరన్ ,ఫాస్ఫరస్ ,క్లోరిన్ ,పొటాషియం ఇలా ఎన్నో ఖనిజాలు లభ్యమవుతాయి. అయితే వీటిని ఎలా తీసుకోవాలి అనుకుంటున్నారా.. చక్కగా దీంతో మనం టీ చేసుకుని తాగవచ్చు.. అదెలాగో తెలుసుకుందాం..

లోటస్ టీ:

ఇప్పుడు మార్కెట్లో గ్రీన్ టీ చాలా ఫ్లేవర్స్ లో దొరుకుతుంది.. అలాగే ఫ్లవర్ టీ లో కూడా ఏనో రకాల ఈజీగా దొరుకుతున్నాయి. వీటిలో లోటస్ ఫ్లేవర్ మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తప్పించుకోవచ్చు. ఇది మరీ కాస్ట్లీ గా ఉంటుంది అనుకునే వారికి ఇంటి వద్దనే లోటస్ టీ చేసుకునే వసతి ఉంది. మనకు దొరికే తామర పువ్వులను.. ఫ్రెష్ గా అయిన వాడొచ్చు లేదు తామర రేకులను జాగ్రత్తగా ఎండలో ఎండబెట్టి  నిల్వ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ ని బాగా మరిగించి.. స్టవ్ ఆఫ్ చేసి.. ఆ వేడి నీటిలో ఒక రెండు తామర రెక్కలను వేసి మూత పెట్టి పక్కన ఉంచాలి. కాసేపటి తర్వాత దాన్ని వడకట్టుకొని గోరువెచ్చగా సేవించాలి. 

ఇలా తామర టీ తీసుకోవడం వల్ల చికాకు ,తలనొప్పి, స్ట్రెస్ ,జ్వరం వంటి సమస్యలు తగ్గడంతో పాటు మన శరీరానికి అవసరమైన ఎన్నో పౌష్టిక తత్వాలు అందుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రోజు లోటస్ టీ తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారు. నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువ అవ్వడంతో పాటు విపరీతమైన నొప్పులతో బాధపడే వారికి లోటస్ టీ రిలాక్సేషన్ కలిగిస్తుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని నియంత్రిస్తుంది కాబట్టి డయాబెటిస్ పేషన్స్ కూడా ఈ టీ తాగవచ్చు. అయితే ఈ టీ ను గర్భిణీలు, పాలిచ్చే తల్లులు,హైపోగ్లైసీమియా ఉన్నవారు, కొన్ని రకాల ఎలర్జీస్ కలిగిన వాళ్లు తీసుకోకూడదు.

 గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..

Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News