Garlic Peel: వెల్లుల్లి తొక్కలతో ఈ సమస్యలన్నీ దూరమవుతాయి.. అవును ఇది నిజం..

Garlic Peel Benefits: వెల్లుల్లి శరీరానికి చాలా మంచిది. ఇందులో వ్యాధినిరోధక శక్తిని పెంచే చాలా రకాల ఔషధగుణాలున్నాయి. కాబట్టి వీటిని ఆహారంగా తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 13, 2022, 09:53 AM IST
  • వెల్లుల్లి తొక్కలతో కూడా శరీరానికి..
  • చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
  • పాదాల వాపులను కూడా తగ్గిస్తుంది.
Garlic Peel: వెల్లుల్లి తొక్కలతో ఈ సమస్యలన్నీ దూరమవుతాయి.. అవును ఇది నిజం..

Garlic Peel Benefits: వెల్లుల్లి శరీరానికి చాలా మంచిది. ఇందులో వ్యాధినిరోధక శక్తిని పెంచే చాలా రకాల ఔషధగుణాలున్నాయి. కాబట్టి వీటిని ఆహారంగా తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. అయితే ఈ తొక్కల్లో కూడా శరీరానికి అవసరమైన చాలా రకాల మూలకాలు ఉన్నాయి. ఈ పీల్స్‌ను తీసుకుంటే శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటిని ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వెల్లుల్లి తొక్కల ప్రయోజనాలు ఇవే:
1. వెల్లుల్లి తొక్కల్లో శరీరానికి అవసరమైన యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అయితే  వీటిని నీటిలో మరిగించి సూప్‌ల చేసుకుని తాగితే.. బాడికీ అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2. వెల్లుల్లి తొక్కల్లో శరీరానికి ప్రయోజనాలు కలిగించే యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే దీని కోసం ఆ పీల్స్‌ను తీసుకుని నీటిలో మరిగించి వాటిని చర్మ సమస్యలు ఉన్న చోట పూయాలి.

3. వెల్లుల్లి పీల్స్ జుట్టు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా తలలో ఏర్పడ్డ చుడ్రు సమస్య ఉంటే సులభంగా దీనికి చెక్‌ పెడుతుంది. అయితే దీని కోసం వెల్లుల్లి తొక్కలను తీసుకుని నీటిలో మరిగించి జుట్టుకు అప్లై చేయాలి.

4. ఆస్తమా సమస్యలకు కూడా ఈ తొక్కలు సహాయపడతాయి. దీని కోసం  వెల్లుల్లి తొక్కలను బాగా గ్రైండ్ చేసి.. ఆ మిశ్రమానికి తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తినండి. ఇలా చేస్తే సులభంగా ఉపశమనం కలుగుతుంది.

5. ఈ తొక్కలు పాదాల వాపులకు కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. దీని కోసం.. వెల్లుల్లి తొక్కలను నీటీలో మరిగించి.. ఈ నీటిని పాదాలకు అప్లై చేయండి. ఇలా చేస్తే సులభంగానే ఉపశమనం కలుగుతుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also read: Metabolism Tips: జీర్ణక్రియకు సంబంధించిన ఏ సమస్యలైనా సరే ఈ ఆహారాలు తీసుకుంటే 2 రోజుల్లోనే మటు మాయం..

Also read: Metabolism Tips: జీర్ణక్రియకు సంబంధించిన ఏ సమస్యలైనా సరే ఈ ఆహారాలు తీసుకుంటే 2 రోజుల్లోనే మటు మాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News