Diet For Diabetes: ఎలాంటి ఖర్చులేకుండా మధుమేహానికి ఇలా చలి కాలంలో 10 రోజుల్లో గుడ్‌బై చెప్పండి..

  Diet For Diabetes: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ కింద పేర్కొన్న ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2023, 04:13 PM IST
Diet For Diabetes: ఎలాంటి ఖర్చులేకుండా మధుమేహానికి ఇలా చలి కాలంలో 10 రోజుల్లో గుడ్‌బై చెప్పండి..

Diet For Diabetes: ప్రస్తుతం చాలా మంది మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా చాలా మంది పలు రకాల రసాయనాలతో కూడా మందులను కూడా వినియోగిస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చాలా మందిలో  ఇన్సులిన్ హార్మోన్ పరిమాణాల్లో మార్పులు రాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు నియత్రించకోవడం చాలా ఇబ్బందిగా మారింది. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా మధుమేహాన్ని నియత్రించుకోవచ్చు. అయితే ఎలా నియంత్రించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 
వీటిని ఆహారంలో తీసుకోండి:
బెర్రీలు:

బెర్రీల్లో పోషకాలున్న సంగంతి అందరికీ తెలిసిందే.. అయితే ఇందులో గ్లైసెమిక్ సూచిక చాలా తక్కువగా ఉంటుంది.  అంతేకాకుండా ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.

బాదం:
బాదం పప్పు తినడం వల్ల కూడా షుగర్ లెవల్స్‌ అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మెగ్నీషియం చక్కెర స్థాయిని అదుపులో ఉంచేందుకు సహాయపడతాయి. బాదంలో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంగా తీసుకుంటే మధుమేహం అదుపులో ఉండడమేకాకుండా, గుండె సమస్యలను కూడా తగ్గిస్తుంది.

చియా విత్తనాలు:
చియా విత్తనాల్లో కూడా షుగర్ స్థాయిని నియంత్రించే చాలా రకాల గుణాలు ఉంటాయి. చియా గింజలలో ఉండే ప్రోటీన్, కాల్షియం ఎముకల సమస్యల నుంచి కూడా సులభంగా రక్షిస్తాయి. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.

ఆకుపచ్చ కూరగాయలు:
డయాబెటిస్‌తో బాధపడేవారికి ఆకుపచ్చ కూరగాయలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఉండే గుణాలు షుగర్‌ లెవల్స్‌ను నియంత్రించి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమన కలిగిస్తాయి. ముఖ్యంగా  పాలకూరను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే శరీరానికి పీచు, మెగ్నీషియం లభిస్తాయి.

Also Read: Golden Globe to Naatu Naatu : నాటు నాటుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్.. ఉబ్బితబ్బిబ్బైన చిరు.. చిన్నపిల్లాడిలా రాజమౌళి

Also Read: Chiranjeevi-Shruti Haasan : శ్రుతి హాసన్‌తో మళ్లీ మళ్లీ చేస్తాడట!.. ఏ మాత్రం ద్వేషం పెట్టుకోని చిరంజీవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News