World Chocolate Day: డార్క్ చాక్లెట్ వల్ల ఎన్ని లాభాలో

Chocolate Benefits: వరల్డ్ చాక్లెట్ డే నేడు. కానీ చాక్లెట్ తినేవాళ్లకు ప్రతీ రోజూ చాక్లెట్ డేనే ( Every Day Is a Chocolate Day ) . చాక్లెట్‌ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. చిన్నపిల్లలు ఏడుపు మానేయాలంటే ఒక చాక్లెట్‌ చాలు.

Last Updated : Jul 7, 2020, 01:33 PM IST
World Chocolate Day: డార్క్ చాక్లెట్ వల్ల ఎన్ని లాభాలో

Dark Chocolate Benefits: వరల్డ్ చాక్లెట్ డే నేడు. కానీ చాక్లెట్ తినేవాళ్లకు ప్రతీ రోజూ చాక్లెట్ డేనే ( Every Day Is a Chocolate Day ). చాక్లెట్‌ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. చిన్నపిల్లలు ఏడుపు మానేయాలంటే ఒక చాక్లెట్‌ చాలు. క్షణాల్లో వారి ముఖంపై చిరునవ్వు తీసుకురావచ్చు. ప్రేయసి అలకను తీర్చడానికి ప్రియుడు చాక్లెట్‌ను నమ్ముకుంటాడు. ఇలా ఏ బంధాన్ని అయినా తీయగా పెనువేసుకునేలా చేసేదే చాక్లెట్. అయితే ఈ రోజుల్లో చాక్లెట్‌లో ఎన్నో వెరైటీలు అందుబాటులో ఉన్నా ఎక్కువ మంది ఇష్టపడేది మాత్రం డార్క్ చాక్లెటే ( Dark Chocolate ) దీని వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. Also Read :Benefits of Crying: ఏడిస్తే ఎన్ని లాభాలో తెలుసా..!

డార్క్ చాక్లెట్ను వారానికి రెండు మూడు సార్లు తినడం వల్ల రక్తపోటు ( BP ) అదుపులోకి వస్తుంది. అది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. అదే విధంగా రక్తం గడ్డకట్టకుండా, ధమనులు గట్టిపడకుండా చూసుకుంటుంది. 

మెదడు పనితీరుపై ( Chocolate For Brain )

బ్రెయిన్ పనితీరుపై డార్క్ చాక్లెట్ సానుకూల ప్రభావం చూపిస్తుంది. గుండెకు రక్తప్రసరణ (Blood Circulation ) పెంచుతుంది. గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మానసిక స్థితి ( Chocolate For Mental Ability )

డార్క్ చాక్లెట్‌లో ఉండే రసాయనాలు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ఫినైలెథిలామైన్ ( Phenylethylamine ) మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.ఇది మీలో సంతోషాన్ని కలిగించే ఆలోచనలకు కారణం అవుతుంది. Also Read : Cough Remedy: దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి

మధుమేహం…( Chocolate For Diabetes ) 

డార్క్ చాక్లెట్ రక్త నాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బ్లడ్ షుగర్ ( Blood Sugar ) కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే ఫ్లెవనాయిడ్స్ ( Flavonoids) కణాల పనితీరును మెరుగుపరిచి..అధిక ఇన్సులిన్ ( Insulin ) ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇది టైప్ 2 డయాబెటెస్ ఉన్న వారికి ఉపయోగకరంగా ఉంటుంది.

పోషకాల నిలయం..( Nutritions in Chocolate )

డార్క్ చాక్లెట్‌లో కాపర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి లాభం కలిగిస్తుంది. దాంతో పాటు డార్క్ చాక్లెట్‌లో ఉండే థియో బ్రోమైన్ ( TheoBromine ) వల్ల పళ్ల ఎనామెల్ గట్టిపడుతుంది.   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   

Trending News