Kaliyugam Pattanamlo: ‘కలియుగం పట్టణంలో’ థియేటర్స్‌లో చూడాల్సిన థ్రిల్లర్ సినిమా: నటుడు నరేన్ రామ్

Kaliyugam Pattanamlo Movie Updates: కలియుగం పట్టణంలో మూవీ ఈ నెల 29న థియేటర్లలో సందడి మొదలు పెట్టనుంది. ఈ సందర్భంగా నటుడు నరేన్ రామ్ మీడియాతో ముచ్చటించారు. సినిమాలో తనకు మంచి పాత్ర దక్కిందని.. తప్పకుండా ఆడియన్స్‌కు నచ్చుతుందన్నారు.

Last Updated : Mar 25, 2024, 05:17 PM IST
Kaliyugam Pattanamlo: ‘కలియుగం పట్టణంలో’ థియేటర్స్‌లో చూడాల్సిన థ్రిల్లర్ సినిమా: నటుడు నరేన్ రామ్

Kaliyugam Pattanamlo Movie Updates: రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న మూవీ ‘కలియుగం పట్టణంలో’. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమాలో నటించిన ప్రముఖ నటుడు నరేన్ రామ్ మీడియాతో ముచ్చటించారు. 

"నేను ఛాన్సుల కోసం వెతుకుతుండగా ఈ సినిమా కో డైరెక్టర్, నా వెల్ విషర్ సాయి అన్న నన్ను పిలిచి ఈ ఆఫర్ ఇప్పించారు. డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి నా ప్రొఫైల్ చూసి ఓకే చేశారు. నా పాత్ర బాగుంటుంది. నాకు కథ నచ్చింది. అందుకే ఈ సినిమా చేశాను. డైరెక్టర్ గారు చాలా కూల్, తనకి కావాల్సినట్టుగా నాకు చెప్పి చేయించుకున్నారు. ఆయనతో ఇంకా వర్క్ చేయాలని ఉంది.

Aslo Read: BRS Loksabha List: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ 17 మంది అభ్యర్ధుల జాబితా

హీరో విశ్వ కార్తికేయ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేశాడు. హీరోగా చేస్తున్నాడు. నాకు వర్క్ విషయంలో చాలా హెల్ప్ చేశాడు. సెట్‌లో మేమిద్దరం డిస్కస్ చేసుకొని యాక్ట్ చేసేవాళ్లం. మా ఇద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. హీరోయిన్ ఆయూషి పటేల్ మంచి అమ్మాయి. తనతో ఎక్కువ ర్యాపో లేదు. బట్ కలిసినప్పుడు కూల్‌గా మాట్లాడతారు. నిర్మాతలు నాని అన్న, మహేష్ అన్న కూడా బాగా క్లోజ్ అయ్యారు. బ్రదర్‌లా ఉండేవారు. కెమెరామెన్ చరణ్ అన్న నన్ను చాలా బాగా చూపించారు. సినిమాలో నాకు టైటిల్ సాంగ్, అమ్మ సాంగ్ బాగా నచ్చాయి. అజయ్ మంచి సంగీతం ఇచ్చారు. 

ఇది ఒక థ్రిల్లర్ మూవీ, అందరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేస్తారు. మార్చి 29న ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ తో సినిమాకు మంచి బజ్ వచ్చింది. సినిమా చూసి నచ్చిన వాళ్ళు ఇంకొంతమందికి చెప్పండి. అందరికి రీచ్ అవుతుంది. మేజర్ సిటీలలో కాలేజీ టూర్స్ కి వెళ్ళాము. అని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ వచ్చి చూస్తారని భావిస్తున్నాం." అని నరేన్ తెలిపారు. 

సీనియర నటుడు గుమ్మడి నరేన్ రామ్ కు తాతయ్య వరుస అవుతారు. అలా మొదటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఏర్పడింది. తెలుగు వారైన నరేన్ తల్లిదండ్రులు చెన్నైలో స్థిరపడటంతో అక్కడ  తమిళ పరిశ్రమలో  ప్రయత్నాలు మొదలుపెట్టారు. పలు యాడ్స్, సినిమాలు చేశానని.. తమిళ్‌లో మూడు సినిమాలు హీరోగా, ఒక సినిమాలో విలన్‌గా చేశానని నరేన్ తెలిపారు. తెలుగులో కలియుగం పట్టణంలో సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నానని.. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేశానని చెప్పారు. ఇక  నరేన్ రామ్ త్వరలో తెలుగులో WHO అనే సినిమాతో రాబోతున్నారు. తమిళంలో కొన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి.

Also Read:  Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News