Annapurnamma: సురేష్‌ కొండేటికి నానమ్మగా అన్నపూర్ణమ్మ.. 'అభిమాని' షూటింగ్ సెట్‌లో సందడి

Suresh Kondeti Abhimani: ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో అభిమాని అనే వెబ్‌ ఫిలిమ్ రూపొందుతోంది. రాంబాబు దోమకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురేష్ కొండేటికి నానమ్మ పాత్రకు సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నటిస్తున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2024, 12:46 PM IST
Annapurnamma: సురేష్‌ కొండేటికి నానమ్మగా అన్నపూర్ణమ్మ.. 'అభిమాని' షూటింగ్ సెట్‌లో సందడి

Suresh Kondeti Abhimani: టాలీవుడ్‌లో అమ్మ పాత్ర చెప్పగానే ఆడియన్స్‌ అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు అన్నపూర్ణమ్మ. మన తెలుగు తెరపై ఎంతోమంది అమ్మ పాత్రలు చేసినా.. అన్నపూర్ణమ్మ చేసిన అమ్మ పాత్రలు చెరగని ముద్ర వేశాయి. అసలు అమ్మ అంటే ఇలాంటి ఉండాలని చాటి చెప్పేలా ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు అన్నపూర్ణమ్మ. చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్రహీరోలకు అమ్మగా నటించి.. ఆ పాత్రలకు వన్నె తెచ్చారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ఎంతగానో ఆకట్టుకునేది.

Also Read: Rasi Phalalu: ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 11వ వరుకు వార ఫలాలు..ఈ రాశులవారికి లాభాలే లాభాలు!  

ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులకు అన్నపూర్ణమ్మ అనగానే అమ్మ పాత్ర కళ్ల ముందు ఉంటుంది. అంతకుముందు ఎంత మంది వచ్చినా సరే ఆమె చేసిన పాత్రలకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అప్పట్లో దర్శకులు కూడా అన్నపూర్ణమ్మ కోసం అంటూ ప్రత్యేకంగా అమ్మ పాత్రను డిజైన్ చేసేవారు అంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్ జనాలు కూడా ఆమెను ఆదరించారు. తమిళ సినిమాల్లో ఆమెకు ఎక్కువ అవకాశాలు వచ్చినా సరే తెలుగు సినిమాలకే ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 

తన పాత్రకు న్యాయం చేయాలనే తపనతో ఆమె నటించే వారు. తన పాత్రకు నటన ఎక్కువగా ఉంటేనే ఆమె సినిమాను అంగీకరించారు. దాదాపు 80 సినిమాల్లో ఆమె అమ్మ క్యారెక్టర్లు పోషించారు. ఇక రీసెంట్‌గా నానమ్మ పాత్రల్లో ఆమె ఎక్కువగా మెప్పిస్తున్నారు. యంగ్ హీరో, హీరోయిన్స్‌ నానమ్మగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా మరో సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యాక్టర్‌గా మారిన సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటికి నానమ్మ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. సురేష్ కొండేటి అభిమాని అనే ఒక వెబ్ ఫిలిమ్‌ చేస్తున్నారు. ఆ మూవీలో ఆమె సురేష్ కొండేటికి నానమ్మ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. బషీర్ అమ్మ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కుతున్న అభిమాని వెబ్ మూవీకి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణమ్మ సెట్‌లోకి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. సురేష్ కొండేటి, ఇతర నటులతో అన్నపూర్ణమ్మ సరదాగా ముచ్చటించారు.  

Also Read: Rasi Phalalu: ఫిబ్రవరి రెండ వారం ఈ రాశులవారిదే పై చేయి..ఇక ధనమే ధనం..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News