Sara Ali Khan, Janhvi Kapoor: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన సారా-జాన్వీ.. ఆ పహారియా బ్రదర్స్ ఎవరో తెలుసా?

Sara Ali Khan, Janhvi Kapoor dated brothers: కాఫీ విత్ కరణ్‌ షో లో కరణ్ జోహార్ సారా అలీ ఖాన్- జాన్వీ కపూర్ ఎపిసోడ్ తరువాత వీర్ పహారియా, శిఖర్ పహారియా ఎవరు?  అంటూ చాలా మంది సెర్చ్ చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2022, 05:44 PM IST
  • అన్నదమ్ములతో డేటింగ్ చేసిన సారా, జాన్వీ
  • గూగుల్ తల్లిని తెగ అడుగుతున్న నెటిజన్లు
  • వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే
Sara Ali Khan, Janhvi Kapoor: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన సారా-జాన్వీ.. ఆ పహారియా బ్రదర్స్ ఎవరో తెలుసా?

Sara Ali Khan, Janhvi Kapoor dated brothers: అసలు ఈ వీర్ పహారియా, శిఖర్ పహారియా ఎవరు? అనుకుంటున్నారా. కాఫీ విత్ కరణ్‌ షో లో కరణ్ జోహార్ సారా అలీ ఖాన్- జాన్వీ కపూర్ ఎపిసోడ్ తరువాత వీరి పేర్లు పెద్ద ఎత్తున గూగుల్ లో ట్రెండ్ అయ్యాయి. సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ అన్నాతమ్ముళ్లను డేటింగ్ చేసారని తెలియడంతో వారెవరో తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్ సెర్చ్‌ని విపరీతంగా వాడేశారు. ఇక చివరికి వారు వీర్ పహారియా అలాగే ఆయన సోదరుడు శిఖర్ పహారియా అని తేలింది.

వీర్ -శిఖర్ ఇద్దరూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవళ్లు. బాలీవుడ్లో జరుగుతున్న ప్రచారం మేరకు వీర్ పహారియా గతంలో సారా అలీ ఖాన్తో డేటింగ్ చేశారు. గతంలో ఒక మీడియా పోర్టల్‌తో మాట్లాడుతూ సారా అలీ ఖాన్ కూడా అతనితో రిలేషన్లో ఉన్నట్లు అంగీకరించింది. అప్పట్లో ఆమె మాట్లాడుతూ, "నేను డేటింగ్ చేసిన ఏకైక వ్యక్తి వీర్, నా జీవితంలో నాకు వేరే బాయ్‌ఫ్రెండ్స్ లేరు." వీర్ విడిపోయినప్పుడు తన హార్ట్ బ్రేక్ చేయలేదని కూడా ఆమె స్పష్టం చేసింది.

అంటే ఇద్దరూ మంచిగానే విడిపోయారు అన్నమాట. సారా కేదార్‌నాథ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి ముందు వీరిద్దరూ డేటింగ్ చేశారని అంటున్నారు. 2016లో వారి ఫోటోలు కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. 28 ఏళ్ల వీర్ ఉన్నత విద్య కోసం దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక సంగీతం మీద విపరీతమైన ఆసక్తి కలిగి ఉన్న వీర్ ఒక మ్యుజీషియన్ అవ్వాలని అనుకున్నారట. ఆయన పలు సినిమాలకు, వెబ్ షోలకు సంగీతం అందిస్తూ ఉంటారని అంటున్నారు. అయితే వీర్ గురించి సారా ఓపెన్ అయితే జాన్వీ మాత్రం శిఖర్ పహారియాతో తన రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు.

తన క్లోజ్ ఫ్రెండ్ సారాలాగే ఆమె కూడా తన బాలీవుడ్ అరంగేట్రానికి ముందు శిఖర్ తో డేటింగ్ చేసిందని పలు బాలీవుడ్ పత్రికలు అప్పట్లో కధనాలు వెలువరించాయి. తన అన్న వీర్ లాగే శిఖర్ కూడా ఉన్నత విద్య కోసం భారతదేశం నుండి లండన్ వెళ్ళాడు. శిఖర్ కి హార్స్ పోలో ఆడటం చాలా ఇష్టం. అతను 2013లో బెర్క్‌షైర్ పోలో క్లబ్ లండన్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన రాయల్ జైపూర్ పోలో జట్టులో సభ్యుడుగా ఉన్నారు. 2018లో, వీర్-శిఖర్ సోదరులు కలిసి గేమింగ్ అలాగే ఎంటర్టైన్మెంట్ బిజినెస్ అయిన ఇండియా వైన్‌ను ప్రారంభించారు.

Also Read: The Warriorr day 1 collections: ఇస్మార్ట్ శంకర్ రికార్డ్ బద్దలు కొట్టలేకపోయిన రామ్.. ది వారియర్ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

Also Read: Kiraak RP Jabardasth: కిరాక్ ఆర్పీ సినిమా అందుకే ఆగింది.. అసలు ఫ్రాడ్ బయటపెట్టిన ఏడుకొండలు

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News