Rajinikanth: ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన రజనీకాంత్.. ఇక రచ్చ రచ్చే!

Rajinikanth gives official update on Jailer: చాలా కాలంగా సినిమాల విషయంలో సైలెన్స్ పాటిస్తున్న రజనీకాంత్ ఎట్టకేలకు తన సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 8, 2022, 05:29 PM IST
 Rajinikanth: ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన రజనీకాంత్.. ఇక రచ్చ రచ్చే!

Rajinikanth gives official update on Jailer: చివరిగా అన్నాత్తే అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ప్రకటించారు కానీ సినిమా యూనిట్ నుంచి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు విడుదలవుతుంది? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. అయితే తాజాగా ఆయన తన అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అసలు విషయం ఏమిటంటే గత కొద్దిరోజులుగా సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు.

స్వాతంత్రం ఏర్పడి 75 సంవత్సరాల పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన ఆయన తాజాగా తమిళనాడు తిరిగి వచ్చి తమిళనాడు గవర్నర్ రవితో భేటీ అయ్యారు. రవితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. తాను మర్యాదపూర్వకంగానే గవర్నర్ ను కలిశానని పేర్కొన్న రజినీకాంత్ పలు రాజకీయ విషయాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చాయి.

కానీ అవి చెప్పలేనని అన్నారు. అయితే రవికి తమిళ ప్రజల మీద చాలా ప్రేమ ఉందని, వారి కోసం ఆయన ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా రజినీకాంత్ వెల్లడించారు. అంతేకాక ఈ సందర్భంగా జీఎస్టీ గురించి మాట్లాడమంటే మాత్రం మాట్లాడడానికి ఆయన ఆసక్తి చూపించలేదు. అయితే తన అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పారు రజినీకాంత్. ఆయన హీరోగా నటిస్తున్న జైలర్ సినిమా ఆగస్టు 15 నుంచి గాని లేదా 22 గురించి గానీ షూటింగ్ ప్రారంభం అవుతుందని వెల్లడించారు.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఐశ్వర్యరాయ్, ప్రియాంక అరుల్ మోహన్, వసంత రవి, రమ్యకృష్ణ, యోగిబాబు వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Also Read: Bimbisara: బాక్సాఫీస్ బద్దలు కొట్టిన బింబిసార.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సీతారామం ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

Also Read: Gehana Vasisth: అప్పుడు రిచ్ బాయ్ ఫ్రెండ్ కావాలని.. ఇప్పుడు విసిగిపోయనంటూ న్యూడ్ ఫోటో పోస్ట్ చేసిన బాలీవుడ్ భామ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News