టాక్సీవాలాకి బెస్టాఫ్ లక్ చెప్పిన బాహుబలి..!

బాహుబలి చిత్రంతో యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటే.. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. 

Last Updated : Nov 16, 2018, 03:13 PM IST
టాక్సీవాలాకి బెస్టాఫ్ లక్ చెప్పిన బాహుబలి..!

బాహుబలి చిత్రంతో యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటే.. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన "టాక్సీవాలా" చిత్రం విడుదలకు సిద్ధమవుతుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ చిత్రం విడుదల సందర్భంగా ప్రభాస్, విజయ్‌కి బెస్ట్ విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. అలాగే ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూడమని.. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయవద్దని ఆయన ప్రేక్షకులను కోరారు.  

జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బేనర్స్ నిర్మిస్తున్న  "టాక్సీవాలా" చిత్రానికి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహించారు. ప్రియాంక జవల్కర్, మాళవిక నాయర్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తుండగా.. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. 2014లో "ది ఎండ్" అనే చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన రాహుల్ షార్ట్ ఫిల్మ్ దర్శకుడిగా సుపరిచితులు. ఇన్ఫోసిస్‌లో ఐటి ఇంజనీరుగా పనిచేసిన.. ఆయన సినిమాల కోసం తన ఉద్యోగం వదిలేశారు. ఆ యువ దర్శకుడే "టాక్సీవాలా" చిత్రానికి దర్శకత్వం చేయడం విశేషం. 

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు కూడా టాలెంట్ ఉన్న యువ దర్శకులకు పెద్ద సినిమాలు ఇస్తుండడం గమనార్హం. 2014లో "రన్ రాజా రన్" చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సుజీత్ రెడ్డి.. ప్రభాస్ నటిస్తున్న "సాహో" చిత్రానికి డైరెక్షన్ వహించడం విశేషం. అలాగే రాహుల్ సాంకృత్యాయన్‌కి విజయ్ దేవరకొండ హీరోగా  "టాక్సీవాలా" సినిమా తీయడానికి అవకాశం లభించింది. రేపు అనగా నవంబరు 17, 2018 తేదిన "టాక్సీవాలా" చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. ప్రభాస్, విజయ్ దేవరకొండకు బెస్ట్ విషెస్ చెప్పడమూ విశేషమే కదా..!

Trending News