Sushmita Sen: లలిత్ కంటే ముందు పది మందితో డేటింగ్.. హీరోలు మొదలు క్రికెటర్ దాకా.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?

List Of Men Sushmitha Sen Dated: సుస్మితా సేన్ ఇప్పటివరకు ఒక్కరినీ పెళ్లి చేసుకోకుండా చాలా మందితో డేటింగ్ చేసిందని అంటూ ఉంటారు. ఈ క్రమంలో అసలు సుస్మిత సేన్ ఎవరెవరితో డేటింగ్ చేసిందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Last Updated : Jul 16, 2022, 06:25 PM IST
  • లలిత్ మోడీతో సుష్మిత ప్రేమాయణం
  • సోషల్ మీడియాలో వైరల్ గా ఫోటోలు
  • అంతకు ముందే పది మందితో డేటింగ్లో సుస్మిత
Sushmita Sen: లలిత్ కంటే ముందు పది మందితో డేటింగ్.. హీరోలు మొదలు క్రికెటర్ దాకా.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?

List Of Men Sushmitha Sen Dated: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  రెండు రోజుల క్రితం ఐపిఎల్ సృష్టికర్త, జీవిత కాలం బీసీసీఐ నిషేధించబడిన లలిత్ మోడీ తాను తన బెటర్ హాఫ్ తో ఎంజాయ్ చేస్తున్నాను అంటూ సుస్మిత సేన్ తో కలిసిన ఫోటోలు షేర్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. లలిత్ మోడీ ఇప్పటికే విడాకులు తీసుకోగా సుస్మితా సేన్ ఇప్పటివరకు ఒక్కరినీ పెళ్లి చేసుకోకుండా చాలా మందితో డేటింగ్ చేసిందని అంటూ ఉంటారు.

ఈ క్రమంలో అసలు సుస్మిత సేన్ ఎవరెవరితో డేటింగ్ చేసిందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె సుమారు పదిమందితో డేటింగ్ చేసిందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న ఆమె ప్రియుల జాబితా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం లలిత్​ మోదీతో సహజీవనం చేస్తున్న లలిత్​ మోదీ కంటే ముందు సుస్మితా సేన్ తనకన్నా చాలా చిన్నవాడైన మోడల్​ రోహ్మాన్‌ షాల్‌తో కొన్నాళ్ళు డేటింగ్ చేసింది.

దాదాపు మూడు సంవత్సరాలు డేటింగ్​ చేసిన తరువాత 2021 డిసెంబర్​లో విడిపోయారు. అంతకు ముందు విక్రమ్​ భట్​ తో కూడా సుస్మిత ప్రేమాయణం నడిపింది. దస్తక్ సినిమా సమయంలో సాన్నిహిత్యం ఏర్పడడంతో కొంతకాలం పాటు ప్రేమాయణం నడిపారు.  అప్పటికే విక్రమ్​కు పెళ్లైన క్రమంలో వివాహ బంధంలో ఇబ్బందులతో విడిపోయారు. 'కర్మా ఔర్ హోలీ' సినిమా సమయంలో సుస్మిత, రణ్​దీప్ హుడా దగ్గరయ్యారని అంటూ ఉంటారు. కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న వీరు  తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు.

2010లో 'దుల్హా మిల్ గయా' చిత్రానికి పనిచేస్తున్నప్పుడు సుస్మిత దర్శకుడు ముద్దాసిర్ అజీజ్‌కి దగ్గరైంది. అనంతరం కొంతకాలం ఇద్దరు డేటింగ్​ చేసినా, కుటుంబ కారణాల వల్ల విడిపోయినట్లు సమాచారం. ఇక 2013లో పాకిస్థాన్​ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్‌తో.. సుస్మిత లివ్ ఇన్ లో ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా పుకార్లు వచ్చాయి కానీ వాటిని ఆమె ధృవీకరించలేదు. వసీం అక్రమ్​ తర్వాత ముంబయిలోని రెస్టారెంట్ యజమానయిన రితిక్ భాసిన్‌తో సుస్మిత ఎఫైర్​ నడిపిందని అంటూ ఉంటారు.

దాదాపు నాలుగేళ్ల సహజీవనం తర్వాత 2017లో వీరు బ్రేకప్​ చెప్పేసుకున్నారు. ఇక అంతకు ముందు 2006లో యాడ్​ డైరెక్టర్ మానవ్ మీనన్‌తో సుస్మిత.. రిలేషన్‌షిప్‌లో ఉందని అంటూ ఉంటారు. అప్పట్లో ఎక్కడికి వెళ్లినా.. కలిసే వెళుతూ కనిపించే వారు. ఏమయిందో ఏమో కొంతకాలానికి విడిపోయారు. వీరు కాకుండా హాట్‌ మెయిల్ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాతో కొన్నాళ్ళు, వ్యాపారవేత్త ఇంతియాజ్ ఖత్రీ, హోటల్ వ్యాపారి సంజయ్ నారంగ్‌తో మరి కొన్నాళ్లు సుస్మిత ప్రేమ వ్యవహారం నడిపిందని అంటూ ఉంటారు. ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయనేది తెలియదు కానీ ఈ వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటుంది. 
Also Read: KGF 2: మొట్టమొదటి సినిమాగా సరికొత్త రికార్డు.. అన్ని బాషలలో కలిపి అదిరేలా!

Also Read: Major: మేజర్ మూవీ అరుదైన రికార్డు.. శత్రుదేశం సహా 14 దేశాల్లో టాప్ మూవీగా!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News