it notices to rashimka mandanna : హీరోయిన్ రష్మిక మందన్నకు ఐటీ నోటీసులు

'సరిలేరు నీకెవ్వరు' అంటూ తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న కన్నడ భామ రష్మిక మందన్న. వరుసగా సూపర్ హిట్ లు తన ఖాతాలో వేసుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది.

Last Updated : Jan 19, 2020, 10:16 AM IST
it notices to rashimka mandanna : హీరోయిన్ రష్మిక మందన్నకు ఐటీ నోటీసులు

'సరిలేరు నీకెవ్వరు' అంటూ తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న కన్నడ భామ రష్మిక మందన్న. వరుసగా సూపర్ హిట్ లు తన ఖాతాలో వేసుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. తాజాగా ఈ భామ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. సొంత రాష్ట్రం కర్ణాటక మిరాజ్ పెటేలోని  ఆమె నివాసాల్లో ఇటీవల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రష్మిక కుటుంబ సభ్యులు సొంతూరులో ఓ కళ్యాణ మండపం నిర్వహిస్తున్నారు. ఆమె ఇంటితోపాటు కళ్యాణ మండపంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా  25 లక్షల రూపాయల నగదుతోపాటు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఆమె కుటుంబ సభ్యులు చూపించలేదు. దీంతో ఐటీ అధికారులు నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు నోటీసులు జారీ చేశారు.

ఈ నెల 21 హజరు కావాలి

ఈ నెల 21న బెంగళూరు, మైసూరు ఐటీ కార్యాలయ్యాల్లో రష్మిక మందన్న హాజరు కావాలని ఐటీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. పట్టుబడ్డ నగదు, పత్రాలకు సంబంధించి సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో కోరారు.Read Also:రష్మిక మందన్న నివాసంపై ఐటి దాడుల్లో కొత్త కోణం!  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News