Kushi Update: విజయ్-సమంతల '‘ఖుషి'’ సినిమా షూటింగ్ పూర్తి.. రిలీజ్ కు రెడీ..!

Kushi Movie: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న 'ఖుషి' మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2023, 07:06 AM IST
Kushi Update: విజయ్-సమంతల '‘ఖుషి'’ సినిమా షూటింగ్ పూర్తి.. రిలీజ్ కు రెడీ..!

Kushi Movie Update: విజయ్ దేవరకొండ, సమంత లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం'ఖుషి'. పాన్ ఇండియా మూవీగా రాబోతోన్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, అలీ కీలకపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.  

మరోవైపు ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయినట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన చిత్ర యూనిట్, గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా షూటింగ్‌కు సమాంతరంగా జరుపుతూ వచ్చినట్లు తెలిపింది. ఇప్పటికే సినిమాకు సంబంధించి 70శాతం పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. ఈ సినిమా రిలీజైన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. నా రోజా నువ్వే, ఆరాధ్య సాంగ్స్ యూట్యూబ్ లో దుమ్ములేపుతున్నాయి.  ఆరాధ్య పాటకు చిత్ర దర్శకుడు శివ నిర్వాణ లిరిక్స్ అందించడం విశేషం.

ద్రాక్షారామంలో చివరి షెడ్యూల్!
రీసెంట్ గా ఏపీలోని ద్రాక్షారామంలోని దేవాలయంలో 'ఖుషి' షూటింగ్ చేశారు. ఆ చిత్రీకరణలో మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ కూడా పాల్గొన్నారు. వాళ్ళిద్దరూ యాగం చేస్తుంటే... వెనుక విజయ్ దేవరకొండ, సమంత నిలబడి ఉన్నారు. ఈ వీడియోను విజయ్ దేవరకొండ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 'ది దేవరకొండ బ్రాడ్ కాస్ట్' ఛానల్ క్రియేట్ చేసిన ఆయన... అందులో ఈ వీడియోను షేర్ చేశారు. ఇది 'ఖుషి' చివరి షెడ్యూల్ అని ఆయన పేర్కొన్నారు. 

Also Read: Pawan Kalyan First Video: అందరు హీరోల ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేసిన పవన్ కళ్యాణ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News