Kushi Title Song: 'ఖుషి' నుంచి నయా మెలోడీ.. టైటిల్ సాంగ్ అదిరింది..

Kushi Title Song: విజయ్ దేవరకొండ లీడ్ రోల్ చేస్తున్న ఖుషి సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మెలోడియస్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని వరల్డ్ వైడ్ గా సెప్టెంబరు 01న విడుదల చేయనున్నారు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 29, 2023, 08:26 AM IST
Kushi Title Song: 'ఖుషి' నుంచి నయా మెలోడీ.. టైటిల్ సాంగ్ అదిరింది..

Kushi Title Song Released:  క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'ఖుషి' (Kushi Movie). శివ నిర్వాణ దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం రిలీజైన పోస్టర్స్ కు, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనేపథ్యంలో ఖుషి టైటిల్ సాంగ్ ను శుక్రవారం రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సాంగ్ కు దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యం అందించగా.. చిత్ర సంగీత దర్శకుడు హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌ ఈ పాటను ఆలపించారు. బృందా మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సెప్టెంబరు 01 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తమిళ్, మలయాళ మరియు కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. 

ఖుషి మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన 'నా రోజా నువ్వే' సాంగ్ వంద మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్ సృష్టించింది. మరో సాంగ్ 'ఆరాధ్య 'కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తాజాగా రిలీజైన టైటిల్ సాంగ్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, యలమంచలి రవిశంకర్ ఖుషి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఖుషి సినిమాలో జయరామ్, మురళీ శర్మ, సచిన్ ఖేడకర్, లక్ష్మి, రోహిణి, వెన్నెల కిశోర్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఖుషి పై భారీగానే అంచనాలు ఉన్నాయి. 

Also Read: Bro Full Movie Leaked: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. బ్రో ఫుల్ మూవీ HD ప్రింట్ లీక్

Also Read; Rangabali ott release: నెట్‌ఫ్లిక్స్‌లోకి నాగశౌర్య ‘'రంగబలి’'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News