Vijay Samantha : నువ్వేం చేసినా కరెక్ట్‌గానే చేస్తావ్.. సమంతపై విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్

Samantha Shaakuntalam Release Date సమంత శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు కొన్ని చోట్ల పడ్డాయి. మీడియాకు స్పెషల్‌గా షోలు వేశారు. శాకుంతలం సినిమా పూర్తి టాక్ మరి కొద్దిసేపట్లోనే వస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2023, 07:56 PM IST
  • నెట్టింట్లో సమంత శాకుంతలం సందడి
  • రేపే థియేటర్లోకి గుణశేఖర్ సినిమా
  • సపోర్ట్ చేసిన విజయ్ దేవరకొండ
Vijay Samantha : నువ్వేం చేసినా కరెక్ట్‌గానే చేస్తావ్.. సమంతపై విజయ్ దేవరకొండ ట్వీట్ వైరల్

Vijay Supports Samantha స్యామీ.. నువ్వెప్పుడూ పరిపూర్ణమైన ప్రేమతో ఉంటావ్.. ఎప్పుడూ సరైన పనులు చేయాలని అనుకుంటావ్.. సంతోషాన్ని పంచుతావ్.. ప్రతీ షాట్‌కు ప్రాణం పెడతావ్.. గత ఏడాదిగా నువ్ ఎంత కష్టపడుతున్నావో ఈ ప్రపంచానికి తెలియదు.. అయినా సరే నవ్వుతూ ఉండేందుకు ప్రయత్నిస్తున్నావ్.. ముందుకు అడుగులు వేస్తూనే ఉంటున్నావ్.. కానీ ఇప్పుడు నీ బాడీకి రెస్ట్ అవసరం.. రేపు రాబోతోన్న శాకుంతలం సినిమాకు ఆల్ ది బెస్ట్.. లక్షల మంది అభిమానుల ప్రేమే నీకు బలం.. అవే నిన్ను రక్షిస్తుంటాయి.. నీకు అంతా మంచే జరుగుతుంది అని విజయ్ చెప్పుకొచ్చాడు.

విజయ్ సమంత మధ్య మంచి ర్యాపో ఉన్న విషయం తెలిసిందే. మహానటి సినిమా కోసం ఈ ఇద్దరూ కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మరింత క్లోజ్ నెస్ పెరిగింది. అయితే సమంత విజయ్‌లు పూర్తి స్థాయి సినిమాలో జోడిగా నటించాలని ఇది వరకు కూడా ప్రయత్నాలు జరిగాయి. కానీ అవేవీ ఫలించలేదు.

 

శివ నిర్వాణ చెప్పిన కథకు విజయ్, సమంతలు ఓకే చెప్పడం, అలా వెంటనే సెట్స్ మీదకు వెళ్లడం జరిగింది. గత ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ సమంతకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో షూటింగ్‌లు క్యాన్సిల్ అయ్యాయి. అలా విజయ్ సమంతల ఖుషి ఇంకా ఆలస్యం అవుతూనే ఉంది. ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్‌ను తిరిగి మొదలుపెట్టారు. మొన్నటి వరకు కేరళలో షూటింగ్ జరిపారు. అంతకు ముందు కాశ్మీర్ షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే.

Also Read:  Samantha : సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే

ఇప్పుడు మళ్లీ సమంతకు హెల్త్ బాగా లేకపోవడంతో కాస్త గ్యాప్ ఇచ్చారు. శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కూడా కాస్త గ్యాప్ ఇచ్చినట్టు అయింది. మొత్తానికి సమంతతో సినిమాలు అంటే మాత్రం ఇప్పుడు కత్తిమీద సాములానే మారింది దర్శక నిర్మాతలకు. షూటింగ్‌లకు ఎప్పుడు ఓకే అంటుంది.. ఎప్పుడు బ్రేక్ ఇస్తుంది.. తీసుకుంటుంది అనే విషయంలో ఎవ్వరికీ క్లారిటీ లేదు.

Also Read: Renu Desai : పవన్ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడు?.. నిలదీసిన నెటిజన్.. రేణూ దేశాయ్ రిప్లై వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News