Kushi second Single: 'ఖుషి' నుంచి మరో మెలొడీ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న 'ఆరాధ్య' పాట..

Kushi Movie update: విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఖుషి. తాజాగా ఈ మూవీ నుంచి రెండో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 13, 2023, 07:09 AM IST
Kushi second Single: 'ఖుషి' నుంచి మరో మెలొడీ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న 'ఆరాధ్య' పాట..

Kushi second Single: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, టాప్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్.. ఖుషి సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన నా రోజా నువ్వే’ అనే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. 

తాజాగా(జూలై 12) రెండో సింగిల్ ను కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఆరాధ్య అంటూ సాగే ఈ మెలోడీ కూడా ప్రేక్షకులను మెస్మరెజ్ చేస్తోంది. మరోసారి తమ గాత్రంతో సిధ్ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద మాయ చేశారు. ఈ సాంగ్ లో విజయ్, సామ్ కెమిస్ట్రీ కూడా అదిరింది. అయితే ఈ పాటకు చిత్ర దర్శకుడు  శివ నిర్వాణనే తెలుగు లిరిక్స్ అందించడం విశేషం. ఈ ఆరాధ్య పాటను తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News