Ranga Ranga Vaibhavanga Teaser: 'రంగ రంగ వైభంగా'... ఎలా ఉంది? టీజర్ నిజంగానే నెక్ట్స్ లెవెల్!!

Vaishnav Tej, Ketika Sharma New Movie: డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ తేజ్ చేస్తున్న సినిమాకు 'రంగ రంగ వైభవంగా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2022, 03:18 PM IST
  • గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ తేజ్
  • రంగ రంగ వైభవంగా అంటూ వచ్చేస్తున్న మెగా హీరో
  • టైటిల్ టీజర్ విడుదల చేసిన వైష్ణవ్ తేజ్
 Ranga Ranga Vaibhavanga Teaser: 'రంగ రంగ వైభంగా'... ఎలా ఉంది? టీజర్ నిజంగానే నెక్ట్స్ లెవెల్!!

Ranga Ranga Vaibhavanga Teaser: మెగా హీరో వైష్ణవ తేజ్ (Vaishnav Tej) మొదటి సినిమా ఉప్పెన (Uppena)తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తన నటనతో తొలి సినిమాలోనే అందరిని ఆకట్టుకున్నాడు. స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం (Kondapolam) మూవీ పెద్దగా సక్సెస్ కాకపోయినా.. మనోడి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ మెగా హీరో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా తన మూడో సినిమాను వైష్ణవ తేజ్ అధికారికంగా ప్రకటించాడు. 

డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ తేజ్ చేస్తున్న సినిమాకు 'రంగ రంగ వైభవంగా' (Ranga Ranga Vaibhavanga) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు సోమవారం (జనవరి 24) టైటిల్‌ టీజర్‌ను చిత్రబృందం వదిలింది. ఇందులో వైష్ణవ్‌తో యువ హీరోయిన్ కేతిక శర్మ (Ketika Sharma) జోడీ కట్టింది. 'ఏంటే ఊపుకుంటూ వచ్చావ్.. అమ్మాయిలు ట్రీట్‌ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు' అంటూ హీరోకు బటర్‌ ఫ్లై కిస్‌ను బహుమతిగా ఇచ్చింది. 'ఇది నెక్స్ట్‌ లెవల్‌లో ఉంది' అనే హీరో డైలాగ్‌తో టీజర్‌ పూర్తైంది.

Also Read: Undavilli Arun Kumar: ఇప్పుడున్న పరిస్థితుల్లో సమ్మె వద్దని చెబుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి

'రంగ రంగ వైభవంగా' చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ (BVSN Prasad) నిర్మిస్తున్నారు. ఏ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ (DSP) సంగీతం అందిస్తుండగా.. శామ్‌దత్‌ సైనుద్దీన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. టైటిల్‌ టీజర్‌ను చుస్తే.. ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్​టైనర్​గా తీస్తున్నట్లు తెలుస్తోంది. వైష్ణవ తేజ్, కేతిక శర్మ జోడీ బాగా కుదిరింది. ఇక ఈ సినిమా కూడా 'ఉప్పెన' అంత పెద్ద విజయాన్ని సాధించాలని మెగా ఫాన్స్ కోరుకుంటున్నారు.

Also Read: Trolls on Rashmika: అయ్యయ్యో మన 'శ్రీవల్లీ' ప్యాంట్ వేసుకోవటం మర్చిపోయిందా..? రష్మికపై నెటిజన్లు ట్రోల్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News