Rana Rakshasa Raju : రాక్షస రాజుగా రానా.. ఇక లేనట్టేనా!

Rana Upcoming Movie : ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి దర్శకత్వం వహించారు తేజ. అయితే ఈ దర్శకుడు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. నిజానికి తేజ సినిమాలు మొదలుపెడుతున్నారు కానీ.. అవన్నీ పలు కారణాలవల్ల మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ క్రమంలో రానా తో కూడా ఒక సినిమా ప్లాన్ చేసి మధ్యలోనే ఆపేశారు ఈ డైరెక్టర్. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 11, 2024, 09:30 PM IST
Rana Rakshasa Raju : రాక్షస రాజుగా రానా.. ఇక లేనట్టేనా!

Rana Teja Movie : చిత్రం, జయం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకి దర్శకత్వం వహించిన ట్యాలెంటెడ్ డైరెక్టర్ తేజ. ఇప్పుడు మాత్రం ఈ దర్శకుడు పెద్దగా ఫామ్ లో లేరు. కొద్ది సంవత్సరాల క్రితం వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా మాత్రం తేజకి చాలా రోజుల తర్వాత విజయం అందించింది. అయితే ఆ తరువాత ఈ డైరెక్టర్ తీసిన సీత బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈమధ్య దగ్గుబాటి అభిరామ్ ని హీరో గా పరిచయం చేసిన అహింస సినిమా అసలు ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు పోయిందో కూడా తెలీదు. 

అయినా సరే రానా కి మాత్రం తేజ మీద ఉన్న నమ్మకంతో రాక్షస రాజు అనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు ముఖ్యకారణం గతంలో తేజ దర్శకత్వంలో రానా హీరోగా చేసిన నేనే రాజు నేనే మంత్రి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అవ్వటమే. ఈ సినిమా హిట్ అవ్వడంతోనే తేజ మీద నమ్మకం కుదిరిన రానా ఇంకో ఛాన్స్ ఇచ్చారు. 

గత ఏడాది సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఘనంగా బయటకువచ్చింది. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటికి కూడా మొదలవ్వలేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్టు ఉన్నట్టా.. లేక అటకెక్కినట్టా అని మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇలా సినిమా అనౌన్స్ చేసిన ఆపేయడం తేజకి ఇది మొదటిసారి కాదు. వెంకటేష్ తో ఆటా నాదే..వేటా నాదే.. అనే టైటిల్ తో తేజ ఒక సినిమాని ప్లాన్ చేశారు. రామానాయుడు స్టూడియోస్ లో సినిమాకి సంబంధించిన క్యాస్టింగ్ ఆడిషన్లు కూడా జరిగాయి. కొన్ని సీన్ల షూటింగ్ కూడా పూర్తయింది. కానీ సడన్ గా సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ అర్థాంతరంగా  ఆగిపోయాయి.

గోపీచంద్ హీరోగా కూడా ఒక మూవీ ఫిక్స్ అయ్యింది. కథ కూడా రెడీ అయ్యింది. కానీ సినిమా కనీసం మొదలుఅవ్వలేదు. వేరే హీరోల సంగతి పక్కన పెడితే తేజ తన కొడుకుని హీరోగా పెట్టి చిత్రం 2 సినిమా తీయాలని అనుకున్నారు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు.  ఇలా చాలానే సినిమాలు మొదలయి ఆగిపోయినప్పటికీ ప్రేక్షకులు అందరి దృష్టి రాక్షస రాజు సినిమా మీదే ఉండిపోయింది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. అహింసా దిజాస్టర్ తరువాత…రానా ఈ సినిమా కథకి కూడా తేజాకి మార్పులు చెప్పినట్టు.. అయితే తేజ ఇప్పటివరకు కొత్త కథని ఇవ్వనట్టు తెలుస్తోంది. మరి తేజ మార్పులు చేసి ఇస్తారా.. లేకపోతే ఈ సినిమాని కూడా తన ముందు సినిమాల లాగా వదిలేస్తారా అనేది చూడాలి.

ప్రస్తుతం రానా రజినీకాంత్ వెట్టయన్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మరి రాక్షస రాజు సినిమా అసలు తిరిగి మొదలవుతుందో లేదు తేజకే తెలియాలి.
 

Read more: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...

Read more: BJP Madhavi Latha: జాతీయ స్థాయిల్లో గొడవలు చేస్తాం.. పోలీసులకు బీజేపీ మాధవీలత మాస్ వార్నింగ్..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News