Nagarjuna: అక్కినేని కజిన్స్ అందరూ ఒక దగ్గర.. వైరల్ అవుతున్న ఫోటో..

Akkineni Cousins : అక్కినేని కుటుంబం నుంచి కూడా చాలామంది ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఇప్పుడు అక్కినేని కజిన్స్ అందరూ కలుసుకుని.. చాలా సమయం గడిపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 12, 2024, 04:40 PM IST
Nagarjuna: అక్కినేని కజిన్స్ అందరూ ఒక దగ్గర.. వైరల్ అవుతున్న ఫోటో..

Akkineni Cousins Gathering : రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల హడావిడి ఎక్కువగానే ఉంది. ఒకవైపు తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ వెళ్లే జనాల రద్దీ వల్ల..ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే, ఇక ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడ నుంచో తిరిగి తమ ప్రాంతానికి వచ్చి ఓటు వేయడానికి వచ్చే వారి తో నిండిపోయింది.

ఎన్నికల పుణ్యమా అని చాలామంది సొంత ఊళ్ళకి వచ్చేసారు. దీంతో అన్నిచోట్ల పండగ వాతావరణం ఏర్పడింది. పైగా వీకెండ్ కూడా కలిసి రావడంతో ఇళ్ళని బంధుజనాలతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కినేని కుటుంబ సభ్యులు కూడా ఒక గూటిలో చేరారు. తాజాగా అక్కినేని కజిన్స్ అందరూ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది డుతుంది. 

తాజాగా హీరో సుశాంత్ ఇంస్టాగ్రామ్ లో అక్కినేని కజిన్స్ అందరూ కలిసి ఉన్నా ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలో సుశాంత్ తో పాటు చాలామంది అక్కినేని కజిన్స్ ఉన్నారు. హీరో సుమంత్, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్, సుప్రియ కూడా ఈ ఫోటోలో కనిపించారు. వారితో పాటు మరికొంతమంది అక్కినేని కజిన్స్ ఉన్నారు. అందరూ కలిసి నవ్వుతూ ఫోటోలకి పోజ్ ఇచ్చారు. 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sushanth A (@iamsushanth)

సుశాంత్ షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కినేని కజిన్స్ అందరినీ ఒకే దగ్గర చూసి అక్కినేని అభిమానులు సంతోషిస్తున్నారు. ఇక ఇందులో కొందరు అక్కినేని సినిమాలతో బిజీగా ఉంటే మరి కొందరు బిజినెస్ లతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ తమకంటూ కొంత సమయాన్ని కేటాయించడానికి ఆదివారం అందరూ వీలు చేసుకొని కలుసుకున్నారు.

ఫోటోలో ఉన్న మిగతా అక్కినేని హీరోలతో పోలిస్తే అక్కినేని నాగచైతన్య ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే దూత అని వెబ్ సిరీస్ తో మంచి హిట్ అందుకున్న నాగచైతన్య ఇప్పుడు తండేల్ సినిమా తో బిజీగా ఉన్నారు. ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత అఖిల్ ఇంకా వెండి తెర మీద కనిపించలేదు. సుశాంత్, సుమంత్, సుప్రియ కూడా సినిమాలలో అంత యాక్టివ్ గా లేరు.

Also Read: Ankita Basappa: రైతు బిడ్డ సరికొత్త రికార్డు.. పదో తరగతిలో 625కు 625 మార్కులు

Also Read: YS Sharmila Tears: వైఎస్ జగన్‌ వ్యాఖ్యలతో కలత.. కన్నీళ్లు పెట్టుకున్న వైఎస్‌ షర్మిల

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News