Samantha Stardom: చైతూ, నాగార్జునలను చిత్తు చేసిన సమంత... తొక్కుకుంటూ పోవాలంటున్న ఫాన్స్!

Yashoda Openings are bigger than Akkineni Heroes: అక్కినేని నాగచైతన్య మాజీ భార్య సమంత నటించిన యశోద మూవీ అక్కినేని హీరోల సినిమాల కంటే ఎక్కువ కలెక్ట్ చేసిందని అంటున్నారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 12, 2022, 03:14 PM IST
Samantha Stardom: చైతూ, నాగార్జునలను చిత్తు చేసిన సమంత... తొక్కుకుంటూ పోవాలంటున్న ఫాన్స్!

Yashoda Openings are bigger than Recent Akkineni Heroes movies: సాధారణంగా సినిమా హీరోల మధ్య పోటీ వాతావరణం నెలకొని ఉంటుంది అయితే ఈ మధ్య అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఒక హీరోయిన్ సినిమాలతో కూడా కంపేర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా సమంత హీరోయిన్ గా యశోద అనే సినిమా రూపొందింది. హరి హరీష్ అనే దర్శక ద్వయం తెరకెక్కించిన ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ రోల్స్ పోషించారు. తెలుగు జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, డాక్టర్ భాగ్యలక్ష్మి తెలుగు డైలాగ్స్ అందించిన ఈ సినిమా నవంబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.  ఆ తర్వాత సినిమా మీద కాస్త డివైడ్ టాక్ వచ్చినా సరే కలెక్షన్స్ విషయంలో మాత్రం పుంజుకుంది. అయితే ఇప్పుడు సమంత సినిమాతో నాగార్జున ది ఘోస్ట్ సినిమా అలాగే నాగచైతన్య థాంక్యూ సినిమాలను నెటిజన్లు కంపేర్ చేస్తున్నారు. యశోద మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల ఒక లక్ష షేర్ ఐదు కోట్ల 40 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది.

అదే నాగచైతన్య థాంక్యూ సినిమా విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా కేవలం రెండు కోట్ల పదహారు లక్షల షేర్, మూడు కోట్ల 70 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే ది ఘోస్ట్ సినిమా పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రెండు కోట్ల 45 లక్షలు వసూలు చేస్తే నాలుగు కోట్ల 60 లక్షల గ్రాస్ వసూలు వసూలు చేసింది. అయితే వీరిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పరిస్థితి కొంచెం పర్వాలేదు ఎందుకంటే ఈ సినిమా 6 కోట్ల 80 లక్షల షేర్ మొదటి రోజు వసూలు చేసింది.

అయితే మాత్రం నాగచైతన్య నాగార్జున సినిమాలతో పోలిస్తే సమంత సినిమా సూపర్ గా కలెక్షన్స్ వసూలు చేయడం మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. సమంత అభిమానులు అయితే నాగచైతన్య నాగార్జున సినిమాలను కంపేర్ చేస్తూ మా సమంత తోపు అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. అనారోగ్య పరిస్థితుల్లో కూడా సినిమాను ప్రమోట్ చేస్తూ సినిమా కలెక్షన్స్ ఊపందుకోవడంలో సమంత తన పాత్ర పోషించిందని వారంతా కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని శ్రీదేవి మూవీస్ పానర్ మీద శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించగా ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ఒక మెడికల్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినిమా యూనిట్ చెబుతోంది.

Also Read: Anusha Shetty Photos: నాగశౌర్యకు కాబోయే భార్య ఎంత అందంగా ఉందో చూశారా?

Also Read: Naga Shaurya fiance Anusha Setty: నాగ శౌర్య కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే.. అన్ని వందల కోట్లకు వారసురాలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News